ఇల్లు Vs తోటలు.. పాములు ఎక్కడ దాక్కోవడానికి ఇష్టపడతాయో తెలుసా?

Samatha

12 February 2026

గ్రామీణ ప్రాంతాలలో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పాములు అడవి, తోటలలో ఎక్కువగా ఉంటాయి, కానీ ఈ మధ్య కాలంలో ఇవి ఇళ్లలో కూడా ఎక్కువ దర్శనం ఇస్తున్నాయి.

పాములు

అయితే పాములు ఎక్కువగా ఇళ్లు కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయంట. ముఖ్యంగా ఆహారం, ఆశ్రయం, ఉష్ణోగ్రత వీటి వలన పాముల నివాసాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నివాసాల్లో పాములు

అయితే ఇప్పుడు మనం తోటలు, ఇల్లు.. పాములు ఎక్కువ ఎక్కువగా ఆశ్రయం పొందడానికి ఇష్టపడతాయి, వీటిని ఏవి ఎక్కువగా ఆకర్షిస్తాయో తెలుసుకుందాం.

ఇల్లు, తోటలు

పాములు భయం చాలా ఎక్కువగా అందుకే అవి ఎక్కువగా వేటాడే జంతువుల నుంచి దాక్కోవడానికి చీకటి ప్రదేశాలను వెతుక్కుంటాయి. అంతే కాకుండా, అవి ఉండే చోట ఆహారం ఉష్ణోగ్రత, రెండింటికి అనుకూలంగా ఉండేలా చూస్తాయి.

ఆహారం, ఉష్ణోగ్రత

పాములు కప్పలు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఎక్కువగా తోటలు, పొలం గట్లపై కనిపిస్తుంటాయి. అలాగే  బొరియలు, కాంక్రీట్ స్లాబ్‌లు, మెట్ల కింద పగుళ్లు ఉన్న చోట పాములు ఆవాసాలను ఏర్పరుచుకుంటాయి.

బొరియలు

ముఖ్యంగా పాములు ఎక్కువగా వాతావరణాన్ని బట్టి, అంటే బయట వేడిగా ఉంటే, చల్లని ప్రదేశాలు,తోటల నీడలు,కంపోస్ట్ గుంటలు, భూగర్భ బొరియలలో ఉండానికి ఇష్టపడతాయి, బయట చల్లగా ఉంటే, పునాదుల కింద, బొరియల్లో దాక్కుంటాయి.

బొరియలు

చాలా వరకు పాములు తోటలు, ఇళ్లల్లో ఉండటానికి ఇష్టపడవు, కానీ, ఇళ్లల్లో ఎలుకలు,కప్పలు, కీటకాలు, ఉండటం, రక్షణ కోసం వృక్ష సంపద ఉన్నప్పుడే అవి ఇల్లల్లో కి వస్తాయంట. కానీ వేసవి కాలంలో మాత్రం తోటలనే ఆశ్రయంగా చేసుకుంటాయంట.

తోటలు

అందుకే ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఎలాంటి చెత్త చెదారం లేకుండా, ఎలుకలు వంటి వాటికి ఆవాసంగా ఉండేలే లేకుండా చూసుకోవాలంట.

జాగ్రత్తలు