AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day: లవర్స్‌ డే రోజు గిఫ్ట్‌లు ఇవ్వడం పాత ట్రెండ్.. అది చేస్తేనే ఇప్పుడు వైరెటీ థ్రిల్!

వాలెంటైన్స్ డే అంటే కేవలం ప్రేమించిన వారికి చాక్లెట్లు, గులాబీలు ఇచ్చి తమ ప్రేమను వ్యకపరచడమనేది పాత ట్రెండ్. ఇప్పుడు కొత్త ట్రెండ్‌ ఏంటంటే పార్టనర్‌తో కలిసి కొత్త, కొత్త ప్రదేశాలను చుట్టేయడం. అవును ఇది మేం చెబుతున్నది కాదు రీసెంట్‌గా జరిగిన ఓ సర్వేలో భారతీయుల రొమాంటిక్ ఇష్టాలపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో చూద్దాం పదండి.

Valentine's Day: లవర్స్‌ డే రోజు గిఫ్ట్‌లు ఇవ్వడం పాత ట్రెండ్.. అది చేస్తేనే ఇప్పుడు వైరెటీ థ్రిల్!
New Valentine's Day Trend 2026
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Feb 12, 2026 | 2:48 PM

Share

ప్రేమికుల రోజు వచ్చేసింది. ఈ క్రమంలో తమ ప్రేయసి లేదా భాగస్వామిని ఎలా ఇంప్రెస్ చేయాలా అని అంతా ఆలోచిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఖరీదైన బహుమతుల కంటే ట్రావెలింగ్ కే యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ నిర్వహించిన సర్వే ప్రకారం.. దాదాపు 86 శాతం మంది ఇండియన్స్ తమ భాగస్వామితో కలిసి ట్రిప్ ప్లాన్ చేయడాన్ని అత్యంత సెక్సీ అండ్ రొమాంటిక్ జెస్టర్‌గా భావిస్తున్నారట.

సర్వేలోని ముఖ్యాంశాలు:

86 శాతం మంది భారతీయులు వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. ఇది బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని వారు నమ్ముతున్నారు. బిజీ లైఫ్ స్టైల్ వల్ల దొరకని క్వాలిటీ టైమ్ ను ట్రిప్స్ ద్వారా పొందవచ్చని మెజారిటీ జంటలు అభిప్రాయపడుతున్నాయి. ఒకప్పుడు కేవలం డిన్నర్ డేట్స్ లేదా మూవీస్ కే పరిమితమైన రొమాన్స్, ఇప్పుడు అడ్వెంచర్ ట్రిప్స్, బీచ్ రిసార్ట్స్ వైపు మళ్లింది.

ఈ సర్వే ప్రకారం ప్రయాణాలు చేయడం వల్ల భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. కొత్త ప్రదేశాలను అన్వేషించే క్రమంలో ఒకరి గురించి ఒకరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఫిజికల్ గిఫ్ట్స్ కంటే ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ కే జనం జై కొడుతున్నారు.

ప్రేమికుల రోజున కేవలం వస్తువులు ఇవ్వడం కంటే మధురమైన జ్ఞాపకాలను మిగిల్చే ట్రిప్ ప్లాన్ చేయడం గొప్ప విషయం అని సర్వేలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గోవా, రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్, కేరళ బ్యాక్ వాటర్స్ వంటి ప్రదేశాలకు భారతీయులు క్యూ కడుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా మాల్దీవులు, థాయ్‌లాండ్ వంటి దేశాలకు డిమాండ్ పెరిగింది. కాబట్టి ఈ వాలెంటైన్స్ డేకి మీరు కూడా మీ పార్ట్‌నర్‌ను సప్రైజ్ చేయాలనుకుంటే.. ఓ మంచి ట్రిప్ ప్లాన్ చేసేయండి మరి!

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు
నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు
వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూశారా..?
వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూశారా..?
అమెరికాలో H-1B ఉద్యోగులకు షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?..
అమెరికాలో H-1B ఉద్యోగులకు షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?..
భయంకరమైన మలుపులు.. క్లైమాక్స్‏లోనే అసలు ట్విస్ట్..
భయంకరమైన మలుపులు.. క్లైమాక్స్‏లోనే అసలు ట్విస్ట్..
అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు..
అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు..
మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే పవర్ఫుల్ ఆకు..
మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే పవర్ఫుల్ ఆకు..
వినాయకుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తేనే
వినాయకుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తేనే
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న పలు దేశాల నేతలు..
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న పలు దేశాల నేతలు..
గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే హత్య!
గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే హత్య!
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి నాలుగు బెనిఫిట్స్.. చాలామందికి ఈ విషయాలు.
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి నాలుగు బెనిఫిట్స్.. చాలామందికి ఈ విషయాలు.