మీకు బ్రేకప్ అయ్యిందా.. నో టెన్షన్.. లవ్ ఫెయిల్యూర్ నుంచి ఇలా బయటపడండి!

Samatha

12 February 2026

వాలెంటైన్స్ డే వస్తే చాలు లవ్ బ్రేకప్ అయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. గతంలో తమ లవర్‌తో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడి పోతుంటారు.

వాలెంటైన్స్ డే

అయితే మీరు కూడా మీరు ప్రేమించిన వారిని దూరం చేసుకొని బాధపడుతున్నారా? పదే పదే వారి జ్ఞాపకాలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే నో టెన్షన్ భయ్యా.. మీ కోసమే ఈ అదిరి పోయే చిట్కాలు.

బ్రేకప్

మీరు మీ ప్రేమలో ఉన్న మధుర జ్ఞాపకాల కంటే, తాను ఉన్న సమయంలో మీరు అనుభవించిన ఇబ్బందులను గుర్తు చేసుకోవాలి. ఇది కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది.

చేధు అనుభవాలు

అలాగే రోజులు గడుస్తున్న కొద్ది, ప్రేమ, మీ లవర్‌కు సంబంధించిన ప్రతి జ్ఞాపకాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మీరు ఆనందంగా ఉంటారు.

జ్ఞాపకాలు మర్చిపోవడం

ఒంటరిగా ఉండకూడదు, నలుగురితో కలిసి ఉండటం, వారితో మాట్లాడుతూ మీ ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకు రాకుండా చూసుకోవాలి. అప్పుడే హాయిగా ఉంటారు.

ఒంటరిగా ఉండకూడదు

విడిపోయిన వారిని మళ్లీ కలిసే ప్రయత్నం చేయకూడదు.  ముఖ్యంగా తన నెంబర్ మీ ఫోన్‌లో లేకుండా చూసుకోవాలి, గత జ్ఞాపకాలు, మెసేజ్‌లు ఫొటోస్ డిలీట్ చేయాలి.

మళ్లీ కలవాలనే ప్రయత్నం

బ్రేకప్ బాధను ఒకసారి ఇతరులు చెప్పి వదిలేసిందంట, దాని గురించి మరోసారి ఎప్పుడూ ఎవరి వద్దా మాట్లాడకూడదు. ఇది మీకు మంచి చేస్తుంది.

బ్రేకప్ బాధ

ముఖ్యంగా మీ లవర్ మీకు ఇచ్చిన బహుమతులు మీకు కనిపించకుండా పెట్టుకోవాలి. మీరు తనను మీ జీవితంలో నుంచి పూర్తిగా తొలిగించే వరకు అవి కనిపించకుండా చేయాలి.

బహుమతులు

ముఖ్యంగా మీ ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపాలి.  మీ కెరీర్‌పై దృష్టి సారించాలి. బాధ, కోపాన్నంతా మీ కెరీర్‌పై పెడితే గొప్ప భవిష్యత్‌ ఉంటుంది.

ఫ్యామిలీ