బంగారం పెరిగినా నో టెన్షన్.. ఇక ఖరీదైన వజ్రాలు అందరికీ అందుబాటులోనే..
Samatha
12 February 2026
వజ్రం విలువ గురించి చెప్పాల్సిన పనే లేదు. బంగారం సామాన్యుల అలంకారం అయితే ధనవంతుల అలంకారం వజ్రం. ఇది మధ్య తరగతి వారికి అందని ద్రాక్ష అని చెప్పాలి.
వజ్రం
అందుకే చాలా వరకు సామాన్యులు ఎవరూ కూడా వజ్రం కొనుగోలు చేయాలనే ఆలోచన కూడా చేయరు. ఎక్కువగా బంగారు నగలు కొనుగోలు చేసి దానితోనే సంతృప్తి పడుతుంటారు.
బంగారం
కానీ ఈ రోజుల్లో బంగారం కొనుగోలు చేయడం కూడా కష్టమైపోయింది. ఎందుకంటే? రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్యులు బంగారం కొనుగోలు చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేలా ఉంది.
గోల్డ్ ధరలు
అయితే బంగారం పెరిగినా నో టెన్షన్ అంటూ, మధ్య తరగతి వారికి తీపి కబురు చెబుతున్నారు శాస్త్ర వేత్తలు. ఎందుకంటే? బంగారం కాదు, ఇక అందరికీ అందు బాటులోనే వజ్రాలు రానున్నాయంట. అది ఎలానో తెలుసుకోండి.
నో టెన్షన్
ల్యాబ్ గ్రోన్ డైండ్స్ రూపొందించే ప్రక్రియ చేపట్టారు శాస్త్ర వేత్తలు. స్వచ్ఛమైన వజ్రాలను పోలిన కృత్రిమ వజ్రాలను తయారు చేయబోతున్నారు. ఇవి సామాన్యుడికి అలంకారంగా మారబోతున్నాయి.
కృత్రిమ వజ్రాలు
వీటి తయారీ.. భూ అంతర్భాగంలో విపరీతమైన వేడి ,ఒత్తిడి వలన బొగ్గు వజ్రంగా ఎలా మారుతుందో, ల్యాబ్‌లో కూడా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి, హెచ్ పీహెచ్ టీ పద్ధతిలో వజ్రాలను తయారు చేస్తారు.
ల్యాబ్
చాలా తక్కువ సమయంలోనే వజ్రపు ముక్కలతో ఆకృతులను తయారు చేసి, సీవీడీ అనే రసాయనిక పద్ధతి ద్వారా వజ్రపు పొరలను నిర్మిస్తారు, తర్వాత కార్బన్ పరమాణువులు ఒక దానిపై ఒకటి పేరుకుంటూ పోయి, స్వచ్ఛమైన వజ్రంలా మెరుస్తూ కనిపిస్తుంది.
ల్యాబ్
ఈ వజ్రాలు చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయంట. దీంతో ఒకప్పుడు ధనవంతులు మాత్రమే ధరించే ఈ వజ్రాలను, త్వరలో సామాన్యులు కూడా ధరించనున్నారంట.