ఆదిలాబాద్ పట్టణంలో ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. 11వ వార్డులోని రాంనగర్ పోలింగ్ కేంద్రం వద్ద కత్తితో వచ్చిన ఓ మహిళ కలకలం రేపింది. పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగేలా చేసిన ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకున్నారు.