IND vs WI: దీప్తి, రేణుకల సూపర్ స్పెల్.. విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

భారత్, వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు మధ్య మూడో వన్డే మ్యాచ్ శుక్రవారం (డిసెంబర్ 27) వడోదర వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

IND vs WI: దీప్తి, రేణుకల సూపర్ స్పెల్.. విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
Team India
Follow us
Basha Shek

|

Updated on: Dec 27, 2024 | 10:04 PM

భారత్, వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు మధ్య వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్ వడోదరలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా హేలీ మాథ్యూస్ సారథ్యంలోని జట్టును కేవలం 162 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత బ్యాటర్లు తమ సత్తా చూపి ఈ సులభమైన లక్ష్యాన్ని కేవలం 28.2 ఓవర్లలోనే ఛేదించారు. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది. మూడో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆమె నిర్ణయం తప్పని తెలిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. భారత బౌలర్ల ధాటికి ఏ బ్యాటర్ కూడా నిలువలేకపోయారు. భారత్ తరఫున రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ కలిసి ప్రత్యర్థి జట్టును కకావికలు చేశారు. ఇన్నింగ్స్ తొలి బంతికే వెస్టిండీస్‌కు షాక్ ఇచ్చింది రేణుక. చివరి బంతికి మరో వికెట్‌ తీసింది. ఆ తర్వాత 9 పరుగుల వద్ద మూడో వికెట్‌ కూడా పతన మైంది. దీంతో కరీబియన్ జట్టు ఇక కోలుకోలేకపోయింది. ఆ తర్వాత దీప్తి శర్మ మిగిలిన పనిని పూర్తి చేసింది. రేణుక 9.5 ఓవర్లలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. కాగా, దీప్తి 10 ఓవర్లలో 31 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. వీరిద్దరిసంచలన బౌలింగ్‌తో భారత జట్టు వెస్టిండీస్‌ను 162 పరుగులకే పరిమితం చేసింది.

అయితే ఛేజింగ్‌లో భారత్ 55 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 32 పరుగులతో, జెమిమా రోడ్రిగ్స్ 29 పరుగులతో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. దీప్తి 48 బంతుల్లో 39 పరుగులు చేయగా, రిచా ఘోష్ 11 బంతుల్లో 23 పరుగులు చేసింది. దీంతో భారత్ ఈ చిన్న లక్ష్యాన్ని కేవలం 28.2 ఓవర్లలోనే ఛేదించింది. దీప్తి మొదట బంతితో ఆ తరువాత బ్యాట్‌తో నూ మెరిసింది. దీంతో ఆమె ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది.

ఇవి కూడా చదవండి

వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత 211 పరుగులు, రెండో మ్యాచ్‌లో 115 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్ లో రేణుకా సింగ్ ఠాకూర్ మొత్తం 10 వికెట్లు పడగొట్టింది. తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైంది. దీనికి ముందు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ భారత్ 3-0 తేడాతో వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేశాడు.

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!