AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinod Kambli: నడవలేకపోతున్న వినోద్ కాంబ్లీ.. వీడియో వైరల్.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుతం అతను థానేలోని ఆకృతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాంబ్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ మాజీ క్రికెటర్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు కాంబ్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Vinod Kambli: నడవలేకపోతున్న వినోద్ కాంబ్లీ.. వీడియో వైరల్.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
Vinod Kambli
Basha Shek
|

Updated on: Dec 27, 2024 | 8:00 PM

Share

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ఆసుపత్రి పాలయ్యాడు. అతను ఇంకా పూర్తిగా కోలుకోలేనట్లు తెలుస్తోంది. కాంబ్లీ ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.కాంబ్లీ మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని, త్వరలోనే మెరుగుపడుతుందని డాక్టర్ వివేక్ ద్వివేది ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కాంబ్లీ పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇందులో ఇతరుల సాయం లేకుండా కాంబ్లీ నడవలేకపోతుండడం చూడవచ్చు. వినోద్ కాంబ్లీ అనారోగ్యానికి ప్రధాన కారణం మద్యం అలవాటని తెలుస్తోంది. అయితే అతను మూడు నెలల క్రితమే మద్యం మానేశాడు. కాంబ్లీకి ఫిజియోథెరపీ, న్యూట్రిషన్ సపోర్ట్, స్పీచ్ థెరపీ అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఆ తరువాతే అతని ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుందంటున్నారు. కాంబ్లీ పూర్తిగా కోలుకోవడానికి నిరంతర చికిత్స అవసరమని తెలుస్తోంది. అందుకు చాలా ఖర్చవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శివసేన నాయకుడు , ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కాంబ్లీ చికిత్స కోసం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం సాయం ప్రకటించారు. కాంబ్లీకి పూర్తిగా అండగా నిలుస్తానని హామీ కూడా ఇచ్చారు.

కాగా కాంబ్లీ ప్రస్తుతం థానేలోని అకృతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స లో భాగంగా అతని నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదని ఆసుపత్రి కూడా నిర్ణయించింది. వినోద్ కాంబ్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత జ్వరం, కండరాల నొప్పి, తల తిరగడంతో గత వారం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత మెదడులో రక్తం గడ్డకట్టినట్లు తేలింది. దీనివల్ల అతనికి జ్ఞాపకశక్తి సమస్యలు కూడా తలెత్తాయి. ఇవే గాక రక్తపోటులో హెచ్చు తగ్గులు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో ఇతరుల సాయంతో నడుస్తోన్న వినోద్ కాంబ్లీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..