IND vs AUS: ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. పంత్, జడేజా ఔట్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
Australia vs India, 4th Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. లంచ్ విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. ఫాలోఆన్‌ను కాపాడుకోవడానికి భారత జట్టుకు 31 పరుగులు కావాల్సి ఉంది. నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు అజేయంగా నిలిచారు.

17 పరుగుల వద్ద రవీంద్ర జడేజా ఔటయ్యాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. రిషబ్ పంత్ (28 పరుగులు) స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో నాథన్ లియాన్ చేతికి చిక్కాడు.
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో శనివారం మూడో రోజు తొలి సెషన్ కొనసాగుతోంది. భారత జట్టు 164/5 స్కోరుతో ఉదయం ఆట ప్రారంభించింది. రిషబ్ పంత్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆడటం ప్రారంభించగా, రవీంద్ర జడేజా 4 పరుగులతో బరిలోకి వచ్చారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది.
ఇరు జట్లు..
Lunch on Day 3 of the 4th Test.
India get 80 runs with a loss of two wickets in the morning session.
Scorecard – https://t.co/MAHyB0FTsR… #AUSvIND pic.twitter.com/CI81yXLaK4
— BCCI (@BCCI) December 28, 2024
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..