నితీష్ కుమార్ రెడ్డి
టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం. కుడిచేతి వాటం బ్యాటరైన నితీశ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి తన మెరుపు బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత టీమిండియా తలుపు తట్టాడు. 2024 అక్టోబర్ 6న బంగ్లాదేశ్ పై టీ20 అరంగేట్రం చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా పెర్త్ టెస్టులో 2024 నవంబర్ 2024న టెస్ట్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. బీజీటీ-2024లో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన నాలుగో టెస్టులో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగి శతకం బాది చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో నితీశ్ కు ఇది మొదటి సెంచరీ కావడం విశేషం.
ఇక నితీష్ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 లక్షలతో ఈ వైజాగ్ కుర్రోడిని సొంతం చేసుకుంది. 2024 సీజన్ లో అద్బుతంగా రాణించడంతో 2025 మెగా వేలానికి ముందు రూ. 6 కోట్లతో తిరిగి నితీశ్ ను రిటైన్ చేసుకుంది.