Nitish Reddy: సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
Ind vs Aus 4th Test Match: బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియాకు మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ లో తెలుగు యువకుడు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సెంచరీతో అదరగొట్టాడు. ఆసిస్ గడ్డపై అతి పిన్న వయసులో సెంచిరీ చేసిన మూడో భారతీయ ఆటగాడిగా ఘనత సాధించాడు. 105 పరుగులతో అజేయంగా నిలిచి నాలుగో టెస్ట్‌లో భారత్‌ను ఓటమి అంచుల నుంచి గట్టెక్కించాడు.
India vs Australia: బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియాకు మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ లో తెలుగు యువకుడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో అదరగొట్టాడు. ఆసిస్ గడ్డపై అతి పిన్న వయసులో సెంచిరీ చేసిన మూడో భారతీయ ఆటగాడిగా ఘనత సాధించాడు. నాలుగో టెస్ట్‌లో భారత్‌ను ఓటమి అంచుల నుంచి గట్టెక్కించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి నితీష్ రెడ్డి 105 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ నేపథ్యంలో నితీష్ రెడ్డిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తు లోను ఇలాగే మరిన్ని విజయాలు సాధించి, భారత జట్టుకు తద్వారా దేశానికీ కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటున్నామని అన్నారు. నితీష్ రెడ్డి సెంచరీ సాధించడం పట్ల సచిన్ టెండుల్కర్ సహా పలువురు క్రికెట్ దిగ్గజాలు, పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి
What a moment this for the youngster!
A maiden Test 100 at the MCG, it does not get any better than this 👏👏#TeamIndia #AUSvIND pic.twitter.com/KqsScNn5G7
— BCCI (@BCCI) December 28, 2024
నితీష్ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు..
విశాఖపట్నంకు చెందిన నితీష్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.
‘బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024 లో ఆస్ట్రేలియాతో మెల్బోర్నలో జరుగుతున్న క్రికెట్ నాలుగవ టెస్టు మ్యాచ్ లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితిష్ కుమార్ రెడ్డికి అభినందనలు. టెస్టు మ్యాచ్ లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత సంతోషం కలిగిస్తున్నది. రంజీలో ఆంధ్రా తరపున ఎన్నో విజయాలు సాధించిన నితిష్ కుమార్ రెడ్డి అండర్ 16లో కూడా అద్భుత విజయాలు అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని, భారత క్రికెట్ జట్టులో ఉండి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
చంద్రబాబు నాయుడు ట్వీట్..
బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024 లో ఆస్ట్రేలియాతో మెల్బోర్నలో జరుగుతున్న క్రికెట్ నాలుగవ టెస్టు మ్యాచ్ లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితిష్ కుమార్ రెడ్డికి అభినందనలు. టెస్టు మ్యాచ్ లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత… pic.twitter.com/93QcoWeTOx
— N Chandrababu Naidu (@ncbn) December 28, 2024