- Telugu News Photo Gallery Cricket photos Know about SRH, Team India batter Nitish Kumar Reddy Assets, Wealth, Details Here
IND Vs AUS: తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా.. లెక్కలు చూస్తే స్టన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి మోత మోగించాడు. ఆస్ట్రేలియన్లను తమ గడ్డపైనే కంగారు పుట్టించాడు ఈ తెలుగుబ్బాయ్. నాలుగో టెస్టులో సెంచరీ చేసి శివాలెత్తించాడు. ఒకానొక సమయంలో సెంచరీ కాదు అనుకునేసరికి.. మరో ఎండ్‌లో సిరాజ్ డిఫెన్స్ ఆడటంతో.. లాస్ట్ వికెట్ పడకుండానే నితీష్ రెడ్డి తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Updated on: Dec 28, 2024 | 3:33 PM

తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కంగారూలను కంగారెత్తించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో తన తొలి టెస్టు శతకాన్ని నమోదు చేసి.. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుల భారత ప్లేయర్స్ లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్(18 ఏళ్ల 253 రోజులు, 18 ఏళ్ల 283 రోజులు), రిషబ్ పంత్(21 ఏళ్ల 91 రోజులు) ఉన్నారు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నితీష్ కుమార్ రెడ్డి.. వచ్చే ఏడాది నుంచి ఆ ఫ్రాంచైజీ నుంచి రూ. 6 కోట్లు అందుకోనున్నాడు. 2023లో SRH ఫ్రాంచైజీ నితీష్ రెడ్డిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ కాంట్రాక్ట్, ఇతర బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, బీసీసీఐ కాంట్రాక్టు కలిపి నితీష్ కుమార్ రెడ్డి నికర ఆస్తి విలువ 1 నుంచి 5 మిలియన్ల మధ్య ఉంటుందని అంచనా.

ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డి బీసీసీఐ కాంట్రాక్టు కలిగి ఉన్నాడు. కనీసం మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు ఇచ్చే గ్రేడ్-సీలో ఉన్నాడు. దీని ప్రకారం నితీష్ రెడ్డి ఏడాదికి మ్యాచ్ ఫీజులతో పాటు రూ. కోటి జీతం అందుకుంటాడు.

అటు ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నజరానా ప్రకటించింది. అతడికి రూ. 25 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ఏసీఏ ప్రెసిడెంట్ కేసినేని శివనాధ్ ప్రకటించిన విషయం తెలిసిందే.




