- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS, 4th Test: Jasprit Bumrah becomes joint 2nd fastest Indian to reach 200 wickets in Tests after kapil dev
Jasprit Bumrah: ఎంసీజీలో వికెట్ల ఊచకోత.. తొలి భారత బౌలర్‌గా బుమ్రా అరుదైన రికార్డ్
IND vs AUS, 4th Test: మెల్ బోర్న్ టెస్ట్ ఆసక్తిగా మారింది. నాలుగో రోజు ఆట మరింత రసవత్తరంగా మారుతోంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో 240 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అయితే, ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 4 వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Updated on: Dec 29, 2024 | 10:29 AM

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆటలో జస్‌ప్రీత్ బుమ్రా టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేశాడు. దీంతో భారత్ నుంచి సంయుక్తంగా రెండో రెండో బౌలర్‌గా నిలిచాడు.

రవిచంద్రన్ అశ్విన్ 37 ఇన్నింగ్స్‌ల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించాడు. భారత పేస్ దళాన్ని కమాండ్ చేస్తోన్న బుమ్రా 44వ టెస్టులో రవీంద్ర జడేజా రికార్డును సమం చేస్తూ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

కాగా, రవిచంద్రన్ అశ్విన్ 37 ఇన్నింగ్స్‌ల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించి, అగ్రస్థానంలో నిలిచాడు. భారత పేసర్లలో, బుమ్రా అత్యంత వేగవంతంగా ఈ ఫీట్ పూర్తి చేశాడు. బుమ్రా తర్వాత 50వ టెస్టులో 200వ వికెట్ సాధించిన కపిల్ దేవ్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

34వ ఓవర్లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఇక్కడ ట్రావిస్ హెడ్ ఒక పరుగు చేసి ఔటయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా ఆరోసారి హెడ్‌ని పెవిలియన్ చేర్చాడు.

ఇక పాకిస్థాన్ ఆటగాడు యాసిర్ షా కేవలం 33 టెస్టుల్లోనే అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టి టాప్టలో నిలిచాడు.




