- Telugu News Photo Gallery Cricket photos ICC released the list of nominated players for the T20I Cricketer of the Year award for 2024
ICC Awards: ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. రేసులో బుమ్రా కాకుండా ఆ యంగ్ ప్లేయర్
ICC T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం 4 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఈసారి ఈ అవార్డును గెలుచుకునే రేసులో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అయితే, జస్ప్రీత్ బుమ్రా స్థానంలో భారత్‌కు చెందిన యువ బౌలర్‌ను ఎంపిక చేశారు.
Updated on: Dec 29, 2024 | 6:06 PM

ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన నలుగురు ఆటగాళ్ల జాబితాను ఐసీసీ ఈరోజు విడుదల చేసింది. ఈ నలుగురు ఆటగాళ్లలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, జింబాబ్వే నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేట్ అయ్యారు. ఈ ఆటగాళ్లందరూ టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన నలుగురు ప్లేయర్లను ఎంపీక చేశారు.

ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పేరు ఉంది. అర్షదీప్ సింగ్ చాలా కాలంగా టీ20 క్రికెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అర్షదీప్ కూడా మంచి ప్రదర్శన చేశాడు. అర్షదీప్ ఈ ఏడాది ఆడిన 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మొత్తం 36 వికెట్లు పడగొట్టాడు.

ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది 15 టీ20 మ్యాచ్‌లు ఆడిన హెడ్ 539 పరుగులు చేశాడు. హెడ్ అత్యుత్తమ ఇన్నింగ్స్ 178.47 స్ట్రైక్ రేట్‌తో 80 పరుగులు చేశాడు.

జింబాబ్వే పేలుడు బ్యాట్స్‌మెన్ సికందర్ రజా కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది 24 మ్యాచ్‌లు ఆడిన రజా 573 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ ఇన్నింగ్స్ 133 నాటౌట్‌గా ఉంది. దీంతో పాటు బౌలింగ్‌లోనూ మ్యాజిక్ చేసి 24 వికెట్లు పడగొట్టాడు.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఈ ఏడాది 24 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 738 పరుగులు చేశాడు. ఈ కాలంలో బాబర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ అజేయంగా 75 పరుగులుగా ఉంది.




