IND vs AUS: ముగిసిన మూడో రోజు.. నితీష్, సుందర్‌ల వీరోచిత ఇన్నింగ్స్.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
India vs Australia 4th Test Day 3 Highlights: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో నితీష్ రెడ్డి సెంచరీ ఆధారంగా భారత్ ఆస్ట్రేలియాపై పునరాగమనం చేసింది. ఓ దశలో ఫాలో ఆన్ ప్రమాదంలో పడిన భారత జట్టును.. కేవలం 116 పరుగుల వెనుకంజలో నిలిచేలా చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది.
India vs Australia 4th Test Day 3 Highlights: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో నితీష్ రెడ్డి సెంచరీ ఆధారంగా భారత్ ఆస్ట్రేలియాపై పునరాగమనం చేసింది. ఓ దశలో ఫాలో ఆన్ ప్రమాదంలో పడిన భారత జట్టును.. కేవలం 116 పరుగుల వెనుకంజలో నిలిచేలా చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి 105, మహ్మద్ సిరాజ్ 2 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. తొలి సెంచరీతో చెలరేగిన నితీష్ రెడ్డి భారత జట్టును మ్యాచ్‌లో సజీవంగా ఉంచాడు. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితం డ్రాగా ముగిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
శనివారం మెల్‌బోర్న్‌లో భారత్ 164/5 స్కోరుతో ఆట ప్రారంభించింది. రిషబ్ పంత్ 6 పరుగులు, రవీంద్ర జడేజా 4 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. తొలి సెషన్‌లో 28 పరుగుల వద్ద పంత్ ఔట్ కాగా, 17 పరుగుల వద్ద రవీంద్ర జడేజా ఔటయ్యారు. అప్పుడు టీమ్ ఇండియా స్కోరు 221/7గా నిలిచింది. ఇక్కడి నుంచి నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ 8వ వికెట్‌కు 285 బంతుల్లో 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ఫాలో ఆన్‌ను తప్పించారు. 162 బంతుల్లో 50 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ ఔటయ్యాడు. ఆస్ట్రేలియా తరపున పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ తలో 3 వికెట్లు తీశారు. నాథన్ లియాన్ 2 వికెట్లు తీశాడు. డిసెంబరు 27వ తేదీ శుక్రవారం ఒకరోజు ముందుగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది.
Stumps on Day 3 in Melbourne!#TeamIndia reach 358/9 courtesy a unbeaten maiden hundred from Nitish Kumar Reddy and a fighting fifty from Washington Sundar 👍
Updates ▶️ https://t.co/njfhCncRdL#AUSvIND pic.twitter.com/K8T2kZMsPh
— BCCI (@BCCI) December 28, 2024
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..