AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇది సెంచరీ కాదు పుష్పా.. అంతకుమించి.. ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ ఫైర్ సెలబ్రేషన్స్‌ చూశారా?

Nitish Kumar Reddy Wild Celebrations: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన నితీష్ కుమార్ రెడ్డి.. టీమిండియాను కాపాడాడు. ఫాలో ఆన్ నుంచే కాదు.. భారీ ఓటమి నుంచి తప్పించాడు. తొలి సెంచరీతో ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి తెలుగోడి పవర్ చూపించాడు. వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత కంగారులను టెన్షన్ పెట్టాడు. దీంతో మెల్‌బోర్న్ టెస్ట్ ఫలితం ఆసక్తికరంగా మారింది.

Video: ఇది సెంచరీ కాదు పుష్పా.. అంతకుమించి.. ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ ఫైర్ సెలబ్రేషన్స్‌ చూశారా?
Nitish Kumar Reddy Century Celebrations Video
Venkata Chari
| Edited By: |

Updated on: Dec 28, 2024 | 7:57 PM

Share

Nitish Kumar Reddy Wild Celebrations: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పునరాగనం చేసింది. తెలుగబ్బాయ్ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో మెల్‌బోర్న్ టెస్ట్‌లో భారత జట్టు ఫాలో ఆన్‌ను తప్పించుకోవడమే కాకుండా.. మూడో రోజు దాదాపుగా బ్యాటింగ్ చేసింది. దీంతో ఈ టెస్ట్ ఫలితం డ్రాగా ముగిసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. భారత జట్టు ఇంకా 116 పరుగుల వెనుకంజలో నిలిచింది. నితీష్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ అజేయంగా నిలిచారు.

టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న నితీష్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది కేవలం సెంచరీ కాదని, భారత జట్టు మ్యాచ్‌లో రీఎంట్రీ చేసేలా చేస్తోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నితీష్ రెడ్డి కూడా తన తొలి టెస్ట్ సెంచరీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ముందుగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే పుష్ప స్టైల్‌లో బ్యాట్ తిప్పిన నితీష్ రెడ్డి.. అనంతరం సెంచరీతో మరో అడుగు ముందుకేసి ట్రావిస్ హెడ్‌కు గట్టి కౌంటర్‌గా వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

బ్యాట్‌పై హెల్మెట్‌తో తగ్గేదేలే..

సెంచరీ పూర్తి చేసిన వెంటనే నితీష్ రెడ్డి.. నేలపై మోకాళ్లపై కూర్చుని, తన బ్యాట్‌ను నేలపై ఉంచి, దానిపై హెల్మెట్‌ను పెట్టి సంబరాలు చేసుకున్నాడు. అలాగే, ఆకాశం వైపు చూస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ కనిపించాడు.

తండ్రిని ఇంటర్య్వూ చేసిన గిల్ క్రిస్ట్..

ఈ క్రమంలో తన కుమారుడి ఆటను ప్రత్యక్షంగా చూస్తోన్న తండ్రి పడిన తపన ఎంతో హైలెట్‌గా నిలిచింది. సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు ఆయన పడిన టెన్షన్‌ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో నితీష్ రెడ్డి సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ ఓ స్పెషల్ ఇంటర్య్వూ చేశాడు. ఈ క్రమంలో నితీష్ రెడ్డి తండ్రి మాట్లాడుతూ “మా కుటుంబానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజును మా జీవితంలో మర్చిపోలేం. నితీష్ 14-15 సంవత్సరాల వయస్సు నుంచి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో, ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతి. నితీష్ 99 పరుగులతో ఉన్నాడు. 9 వికెట్లు పడిపోయాయి. నేను చాలా టెన్షన్‌లో ఉన్నాను. సిరాజ్‌‌కి కృతజ్ఞతలు’ అంటూ భావోద్వేగం చెందాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్