Team India: మోకాళ్లపై తిరుమల మెట్లెక్కి మొక్కు తీర్చుకున్న టీమిండియా యంగ్ క్రికెటర్.. వీడియో ఇదిగో

టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ సడెన్ గా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని విశాఖ పట్నానికి వచ్చిన ఈ యంగ్ క్రికెటర్ తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

Team India: మోకాళ్లపై తిరుమల మెట్లెక్కి మొక్కు తీర్చుకున్న టీమిండియా యంగ్ క్రికెటర్.. వీడియో ఇదిగో
Team India Cricketer
Follow us
Basha Shek

|

Updated on: Jan 14, 2025 | 9:52 AM

టీమిండియా క్రికెటర్, వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాడు. అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు బయలు దేరిన నితీశ్ మోకాళ్ల పర్వతం దగ్గర మోకాళ్లపై మెట్లను ఎక్కాడీ యంగ్ క్రికెటర్. చాలామంది భక్తులు మోకాళ్ల పర్వతం దగ్గరకు రాగానే మోకాళ్లపై మెట్లను ఎక్కుతారు. ఇప్పుడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా మోకాళ్లపై మెట్లను ఎక్కి తన మొక్కును తీర్చుకున్నాడు. శ్రీవారి నామస్మరణతో శ్రీవారి సన్నిధికి చేరుకున్న ఈ టీమిండియా క్రికెటర్ కు టీటీడీ పాలక బృందం ఘన స్వాగతం పలికింది. మంగళవారం (జనవరి 14) ఉదయం నితీశ్ శ్రీవారిని దర్శించుకున్నారు. నితీశ్ తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రెడ్డిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. అతనితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పడ్డారు.

కాగా విశాఖ పట్నానికి చెందిన నితీశ్ కుమార్ రెడ్డి ప్రతిష్ఠాత్మక బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని మెల్ బోర్న్ మైదానంలో సెంచరీ సాధించాడు. అంతేకాదు ఈ సిరీస్ లో భారీగా పరుగులు సాధించిన టాప్ బ్యాటర్ల జాబితాలో ఒకడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే త్వరలోనే ఇంగ్లండ్ తో జరిగే టీ20 సిరీస్ కు కూడా ఎంపికయ్యాడీ యంగ్ క్రికెటర్. ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్ తో సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం 5 టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. దీంతో పాటు మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ సమరం ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కుతున్న నితీశ్ కుమార్ రెడ్డి.. వీడియో..

ఇంగ్లండ్ తో టీ 20 సిరీస్ కు నితీశ్ కుమార్ రెడ్డి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..