Rashmika Mandanna: రష్మికకు గాయం.. ఆగిపోయిన సినిమా షూటింగులు.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
పుష్ప 2 తర్వాత రష్మిక మందన్నా క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. దీంతో ఈ అమ్మడు తీరిక లేకుండా షూటింగుల్లో పాల్గొంటోంది. అయితే ఇప్పుడు గాయం కావడంతో ఈ మూవీ షూటింగులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న రెగ్యులర్ గా జిమ్ చేస్తుంది. తద్వారా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటోంది. అయితే ఇప్పుడు అదే ఆమెకు సమస్యను తెచ్చిపెట్టింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా రష్మిక గాయపడింది. దీంతో సినిమా షూటింగుల నుంచి కాస్త విశ్రాంతి కోరింది. కోలుకున్న తర్వాతనే మళ్లీ సినిమా పనుల్లో బిజీ కానుంది. రష్మిక గాయం కారణంగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘సికందర్’ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. మరోవైపు రష్మిక గాయంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనికి రష్మిక సన్నిహిత వర్గాలు సమాధానమిచ్చాయి. ‘జిమ్ చేస్తుండగా రష్మిక గాయపడింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె సినిమా పనులు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె త్వరలోనే సెట్‌లోకి అడుగు పెడుతుంది’ అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా ‘పుష్ప 2’ సక్సెస్‌తో ప్రస్తుతం రష్మిక మందన్న ఫుల్ జోష్ లో ఉంది. ఈ సినిమా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. త్వరలోనే సినిమాకు అదనంగా 20 నిమిషాల సీన్లను జోడించనున్నారు. దీంతో మొత్తం సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాలు ఉంటుంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి ‘సికందర్’ సినిమా షూటింగులో పాల్గొంటోంది రష్మిక. రంజాన్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సల్మాన్ ఖాన్ స్నేహితుడు సాజిద్ నదియావాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
త్వరలోనే సెట్ లోకి..
Good night @iamRashmika
Good news for those who worried like me
She’s good now.. It’s not a serious injury. She’s getting back to work maybe from tomorrow or monday
That injury happened in workout time not in shooting time
So. Sleep well
Ah. Our media’s 🙏#RashmikaMandanna pic.twitter.com/chrc2f2Q8D
— Rashmika Mandanna Wellwisher (@RashuWellWisher) January 10, 2025
రష్మిక చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ధనుష్ కుబేర, విక్కీ కౌశల్ ఛవ్వా, ది గర్ల్ ఫ్రెండ్ తో పాటు మరో రెండు సినిమాలు ఆమె కంప్లీట్ చేయాల్సి ఉంది.ఇక సల్మాన్ కూడా ‘కిక్ 2’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘టైగర్ వర్సెస్ పఠాన్’ తో పాటు అట్లీతో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.