50 ప్లస్‌లోనూ కుర్ర హీరోలతో పోటీ.. చపాతీ ముట్టుకోడు.. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్న ఈ నటుడు ఎవరంటే?

సాధారణంగా చాలా మంది డైట్ లో భాగంగా చపాతీలను ఎక్కువగా తీసుకుంటుంటారు. రైస్ కు బదులు వీటినే ప్రత్యామ్నాయంగా తింటారు. అయితే ఒక నటుడు మాత్రం అసలు చపాతీలు ముట్టుకోడట. అలాగనీ అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్య లు లేవు. కేవలం ఫిట్ నెస్ కోసమే ఇలా స్ట్రిక్ట్ డైట్ ను ఫాలో అవుతున్నాడు.

50 ప్లస్‌లోనూ కుర్ర హీరోలతో పోటీ.. చపాతీ ముట్టుకోడు.. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్న ఈ నటుడు ఎవరంటే?
Tollywood Actor
Follow us
Basha Shek

|

Updated on: Jan 10, 2025 | 2:19 PM

సినిమా ఇండస్ట్రీలో నటీమణుల మాదిరిగానే నటుటు కూడా తమ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆహారం తో పాటు పానీయాల విషయంలోనూ శ్రద్ధ వహించాలి. ఇలా ఆహారపు అలవాట్ల దగ్గర్నుంచి వర్కవుట్ చేసే వరకు చాలా జాగ్రత్తలు తీసుకునే నటీనటులు చాలా మంది ఉన్నారు. అయితే దాదాపు 4 ఏళ్లుగా ఒక్క చపాతీ కూడా ముట్టుకోకుండా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నాడీ ఒక నటుడు. తన ఫిజిక్‌తో కుర్ర హీరోలకు పోటీ నిస్తున్నాడు. అతనే రియల్ హీరో సోనూసూద్. సినిమా ఇండస్ట్రీలో ఫిట్ నెస్ పై శ్రద్ధ వహించే నటుల్లో సోనూ సూద్ ఒకూడా ఒకరు. ఇక అతని డైట్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. అనుసరించడం కూడా చాలా కష్టం. ఇదొక్కటే కాదు, ఫిట్‌నెస్‌లో చాలా మంది ప్రముఖ నటులను మించిపోయాడు సోనూసూద్. తన ఆహారం, పానీయాల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఎన్నో సినిమాల్లో తన నటనతో అందరి మనసులు గెలుచుకున్న సోనూ ఫిట్‌నెస్‌లో సల్మాన్ ఖాన్, జాన్, హృతిక్ రోషన్‌లకు ఏ మాత్రం తీసిపోడు.

సోనుకి ఎలాంటి వ్యసనం లేదు. తాను ఇప్పటి వరకు ఒక్క సిప్ ఆల్కహాల్ కూడా తీసుకోలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఈ నటుడి ఆహారం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఎవరైనా ఇంటికి వస్తే సోనూ తీసుకునే ఆహారం గమనిస్తే ఆసుపత్రి భోజనం అనుకుంటారు. సోనూ పూర్తిగా శాఖాహారి. స్ట్రిక్ట్ డైట్ కారణంగా 4 ఏళ్లలో ఒక్క చపాతీ కూడా తినలేదు. మధ్యాహ్నం పప్పు, అన్నం తినడానికి బాగా ఇష్టపడతాడు.

ఇవి కూడా చదవండి

బ్రేక్ ఫాస్ట్ లో

ఇక సోను అల్పాహారంగా గుడ్డులోని తెల్లసొన, ఆమ్లెట్, సలాడ్, అవకాడో, వేయించిన కూరగాయలు లేదా బొప్పాయిని తినడానికి ఇష్టపడుతాడు. అలాగే కొన్నిసార్లు మొక్కజొన్న తో చేసిన రోటీలు, చపాతీలు తీసుకుంటాడు. ఫిట్‌నెస్ గురించి సోను మాట్లాడుతూ, ‘సరైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండొచ్చు’ అని అంటున్నాడీ రియల్ హీరో.

ఫతే సినిమాలో సోనూ సూద్..

.ప్రస్తుతం సోనూ సూద్ వయసు 51 ఏళ్లు. అతను నటించిన తాజా చిత్రం ‘ఫతే’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను ప్రమోట్ చేసే పనుల్లో బిజీగా ఉంటున్నాడీ రియల్ హీరో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.