Raveena Tandon: సినిమాల్లోకి రవీనా కూతురు.. సెట్‌లోనే ఇంటర్ పరీక్షలకు ప్రిపరేషన్ .. వీడియో చూశారా?
బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ తెలుగు ఆడియెన్స్ కు పరిచయమే. గతంలో బంగారు బుల్లోడు వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. ఆ మధ్యన కేజీఎఫ్ 2 సినిమాలో రమికా సేన్ పాత్రతో మరోసారి దక్షిణాది ఆడియెన్స్ ను అలరించిందీ ముద్దుగుమ్మ.
ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. అజయ్ దేవగన్ నటించిన ‘ఆజాద్’ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ లో రాషా తన లుక్స్ తో కట్టిపడేసింది. ఇప్పుడు ఆమె మొదటి పాట కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాషా డ్యాన్స్, హావభావాలు చూసి స్టార్‌కిడ్‌లందరికీ గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. అదేవిధంగా రాషాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో, ఒక వైపు, రాషా షూటింగ్ కోసం రెడీ అవుతూనే మరోవైపు, ఆమె పుస్తకంతో చదువుతున్నట్లు కనిపించింది. దీనికి నెటిజన్ల నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక వైపు రాషా తన షూట్ కోసం సిద్ధమవుతుండగా, మరోవైపు ఆమె 12 వ బోర్డ్ ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మేకప్ ఆర్టిస్ట్, హెయిర్‌స్టైలిస్ట్ లు రాషాను సన్నివేశం కోసం సిద్ధం చేస్తారు. అదే సమయంలో, రాషా తన షూటింగ్ దుస్తులలో అద్దం ముందు కూర్చుని, ఏకాగ్రతతో చదువుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఈ వీడియోను షూట్ చేసిన వ్యక్తి ఆమెను ఇలా అడిగాడు, ‘రాషా, మీరు షూట్‌కి సిద్ధంగా ఉన్నారా? ఏం చేస్తున్నావు?” అప్పుడు రాషా నెమ్మదిగా కెమెరా వైపు నవ్వుతూ, “నేను చదువుకుంటున్నాను.” అది విని, ఆ వ్యక్తి ఆశ్చర్యపడి, “నీ సీన్స్ కోసం ముందే ప్రిపేరవుతున్నావా?’ అని అడుగుతాడు. దీనికి రాషా ‘నా బోర్డ్ పరీక్షలకు కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేను ఇప్పుడు జియోగ్రఫీ చదువుతున్నాను’ అని చెప్పుకొచ్చింది.
ఆజాద్ మూవీ సెట్ లో రవీనా కూతురు..
View this post on Instagram
ఈ వీడియో చూసిన నెటిజన్లు రాషా కమిట్మెంట్ ను అభినందిస్తున్నారు. అదే సమయంలో కొందరు ఆమెను ఎగతాళి చేశారు కూడా. . ఇండస్ట్రీలోకి రావడానికి ఇంత హడావుడి ఎందుకు? ముందు చదువు పూర్తి చేసుకో’ అని నెటిజన్లు రాషాకు సూచించారు. రాషా తొలి చిత్రం ‘ఆజాద్’ జనవరి 17న థియేటర్లలో విడుదల కానుంది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాషాతో పాటు అజయ్ దేవగన్ కూడా నటించనున్నారు.
కూతురితో రవీనా టాండన్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి