- Telugu News Photo Gallery Cinema photos Is the stage set for Pawan Kalyan son Akira Nandan entry into tollywood
Akira Nandan: అకీరా నందన్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా..
రాజకీయంగా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. పైగా ఆయనిప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం కూడా..! అందుకే ఇదివరకట్లా సినిమాలు చేయడం కుదరట్లేదు.. కుదరదు కూడా. అందుకే తన స్థానంలో తనయుడిని ఫ్యాన్స్‌కి చేరువ చేస్తున్నారా..? కొన్ని రోజులుగా అకీరా పబ్లిక్ ఈవెంట్స్‌లో కనిపించడానికి కారణమదేనా..? అకీరా అరంగేట్రానికి సమయం ఆసన్నమైందా..?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jan 09, 2025 | 7:22 PM

ఎక్కడైనా తండ్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నపుడు.. ఆ బరువు వారసుడికి అప్పజెప్తుంటారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నారు. రాజకీయంగా తను బిజీ అవుతానని తెలిసే.. అకీరా నందన్‌ను ఆడియన్స్‌కు చేరువ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మొన్నటి వరకు అరుదుగా కనిపించిన అకీరా.. ఈ మధ్య క్రమం తప్పకుండా ఫ్యాన్స్‌కు కనిపిస్తున్నారు.

గతేడాది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. వారసుడిని ఇటు చంద్రబాబు.. అటు ప్రధాని మోదీ దగ్గరికి తీసుకెళ్లారు పవన్. నేషనల్ వైడ్‌గా అకీరా నందన్‌ను ఫేమస్ అయ్యేలా చేసారు పవన్.

ఈ గుర్తింపు రేపు అకీరా మొదటి సినిమాకు హెల్ప్ అవుతుందనడంలో సందేహమేం లేదు. ఇప్పటికైతే క్లారిటీ లేదు కానీ కచ్చితంగా త్వరలోనే అకీరా ఎంట్రీ ఉండటం ఖాయంగా కనిపిస్తుంది.

అకీరా నందన్‌కు ఇప్పుడు 21 ఏళ్ళు. నిన్న మొన్నటి వరకు చిన్న పిల్లాడిలా కనిపించినా.. ఇప్పుడు మాత్రం హీరో మెటీరియల్‌లా మేకోవర్ అయ్యారు. ఒప్పుకున్న ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ పూర్తి చేసాక.. పవన్ పూర్తిగా పాలిటిక్స్‌పై ఫోకస్ చేయడం ఖాయం.

ఆ తర్వాత పవన్ స్థానాన్ని జూనియర్ పవర్ స్టార్ భర్తీ చేయాలని చూస్తున్నారు. మొన్న రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు కూడా అన్నయ్య రామ్ చరణ్‌తో కలిసి వచ్చారు అకీరా. పైగా రేణు దేశాయ్ సైతం ఎప్పటికప్పుడు అకీరా అప్‌డేట్స్ ఫ్యాన్స్‌కు ఇస్తుంటారు. తాజాగా ఈమె అకీరా ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. తల్లిగా తను కూడా అకీరా ఎప్పుడొస్తారా అని వేచి చూస్తున్నట్టు తెలిపారు. మొత్తానికి ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే అకీరా ఎంట్రీ ఖాయం అనిపిస్తుంది.





























