The Raja Saab: సస్పెన్స్ కంటిన్యూ.. రాజా సాబ్ వస్తాడా ??

రాజా సాబ్ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా..? దర్శక నిర్మాతలు చెప్తున్నట్లు కచ్చితంగా ఎప్రిల్ 10న విడుదల అవుతుందా..? ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకు..? వస్తుందని మేకర్స్ చెప్తున్నారు కదా అనుకోవచ్చు కానీ మారుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. మరి రాజా సాబ్ రాకపై డౌట్స్ తెప్పిస్తున్న ఈ సిచ్యువేషన్స్ ఏంటి..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Jan 09, 2025 | 7:16 PM

మా రాజా సాబ్ వస్తాడు.. రికార్డులు బద్దలు కొడతాడు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. కల్కితో క్లాసిక్ హిట్ ఇచ్చిన ప్రభాస్.. రాజా సాబ్‌లో మాస్‌తో రచ్చ చేస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్.

1 / 5
మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న రాజా సాబ్‌లో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజా సాబ్‌ను నిర్మిస్తున్నారు.

2 / 5
ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీగానే ఉండబోతున్నాయని ఇప్పటికే తెలిపారు మేకర్స్. షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. అయితే రిలీజ్ డేట్‌పైనే అనుమానాలు వస్తున్నాయిప్పుడు.

3 / 5
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్రిల్ 10న రాజా సాబ్ వస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. రాజా సాబ్ ఎప్రిల్ 10న వస్తుంటే.. ప్రభాస్‌కు పోటీగా మిగిలిన హీరోలు రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ అదేరోజు సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న జాక్ విడుదల కానుంది.

4 / 5
ఈ మధ్యే డేట్ ప్రకటించారు బివిఎస్ఎన్ ప్రసాద్. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్. తాజాగా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ కూడా ఎప్రిల్ 10నే కన్ఫర్మ్ చేసారు మైత్రి మూవీ మేకర్స్. ప్రభాస్ సినిమా అంటే తమిళ మార్కెట్ కూడా ముఖ్యమే. అయితే అదేరోజు అజిత్ సినిమా వస్తుందంటే రాజా సాబ్ డేట్ ఏమైనా మారిందా అనే అనుమానాలు మొదలయ్యాయిప్పుడు. ఏదేమైనా మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేసేవరకు రాజా సాబ్ రిలీజ్ డేట్‌పై ఈ కన్ఫ్యూజన్ తగ్గదు.

5 / 5
Follow us