చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు..అతనిపై కేసు పెట్టిన నిధి అగర్వాల్!
అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని వ్యక్తి తనను సోషల్ మీడియా వేధికగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ, చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. తప్పకుండా ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక ఇప్పటికే హనీరోజ్ కేసుపై విచారణ జరుగుతుండగా, మరో హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది