Tollywood: ‘పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా’.. తన బ్యూటీ సీక్రెట్ చెప్పేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ రోజులు మనుగడ సాగించాలంటే అభినయంతో పాటు అందం కూడా ఉండాల్సిందే. ఇందుకోసం ఎన్నో బ్యూటీ టిప్స్ పాటిస్తుంటారు. అయితే టాలీవుడ్ కు చెందిన ఈ క్రేజీ హీరోయిన్ తన మృదువైన చర్మం కోసం ఉమ్మి (లాలాజలం) ను ఉపయోగిస్తుందట.

Tollywood: 'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా'.. తన బ్యూటీ సీక్రెట్ చెప్పేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Jan 09, 2025 | 9:00 PM

నటీమణులు తమ అందం కోసం ఎప్పుడూ కష్టపడుతుంటారు. మృదువైన చర్మం కోసం ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. అప్పుడప్పుడూ వాటిని తమ అభిమానులతో కూడా పంచుకుంటారు. కొందరు నటీమణులు తమ సొంత బ్రాండ్ బ్యూటీ ఉత్పత్తులను కలిగి ఉన్నారు. ఇంకొందరు మార్కెట్ లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ పై ఆధారపడుతుంటారు. అయితే చర్మ సంరక్షణ చిట్కాల నుండి ఉత్పత్తుల వరకు ప్రతిదానికీ అభిమానుల్లో చాలామంది హీరోయిన్లను అనుసరిస్తుంటారు. అలా తాజాగా అభినయంతో పాటు అందంతోనూ పేరు తెచ్చుకున్న ఓ టాలీవుడ్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో తన బ్యూటీ చిట్కాలను చిట్కాలను పంచుకుంది. ఇది విని అందరూ షాక్ అయ్యారు. తన చర్మాన్ని సంరక్షణ కోసం, అందంగా కనిపించడానికి ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించకుండా, ఈ క్రేజీ హీరోయిన్ తన ఉమ్మి (లాలాజలం) ఉపయోగిస్తుందట. ఉదయాన్నే లేవగానే ఆమె తన ముఖంపై సలైవాను అప్లై చేస్తుందట. ఆమె మరెవరో కాదు అభిమానులతో మిల్కీ బ్యూటీ అని పిలిపించుకుంటోన్న తమన్నా భాటియా.

తమన్నా ఒక ఇంటర్వ్యూలో తన చర్మ సంరక్షణ గురించి మాట్లాడుతూ.. ఉదయం లేవగానే తన లాలాజలాన్ని తన ముఖానికి పూస్తానని చెప్పింది. మొదట ఆమెకు ఇది చాలా వింతగా అనిపించిందట. కానీ తరువాత దాని ప్రయోజనాలను గ్రహించిందట. ముఖంపై సలైవా రాయడం వల్ల మచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయంటోంది తమన్నా. తనకు మొటిమలు వచ్చినప్పుడల్లా మిల్కీ బ్యూటీ కొన్ని రోజులు ఈ చిట్కానే అనుసరిస్తుందిట. మొత్తానికి తమన్నా పంచుకున్న బ్యూటీ టిప్స్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

తమన్నా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

కాగా, తమన్నా భాటియా కోట్లకు యజమాని. అలాగే అమేజింగ్ స్కిన్ కేర్ టిప్స్ ఇచ్చిన తమన్నా పెళ్లి, పిల్లల గురించి కూడా తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఈ పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండలేనని మొదట్లో అనుకున్నానని తమన్నా చెప్పింది. 10 ఏళ్లు ఈ ఇండస్ట్రీలో పని చేసి పెళ్లి చేసుకుంటానని అనుకుందట. కానీ ఆమెకు పెళ్లి, పిల్లలంటే భయం పట్టుకుందట. పిల్లలను ఎలా చూసుకుంటారోనని ఆందోళన చెందుతోందట. కాగా తమన్నా చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి.

తమన్నా గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి