Niharika: సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించిన నిహారిక.. అల్లు అర్జున్ గురించి ఏం చెప్పిందంటే?
పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సంధ్య థియేటర్ ఘటనపై మెగా డాటర్ నిహారిక కొణిదెల మొదటిసారిగా స్పందించింది. ఈ తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమంది. రేవతి మరణించడం తనను ఎంతో బాధించిందని నిహారిక ఆవేదన వ్యక్తం చేసింది. చాలా రోజుల తర్వాత నిహారిక నటిస్తోన్న చిత్రం మద్రాస్ కారన్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆమె సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించింది. ‘చెడు జరగాలని ఎవరూ కోరుకోరు. కానీ ఒకరు తమ ప్రాణం కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం. మనం బతకడానికే ఈ పని చేస్తుంటాం. రేవతి మరణ వార్త తెలియగానే నా మనసు ముక్కలైంది. ఇలాంటి ఘటనలు ఎవరూ ఊహించరు. అల్లు అర్జున్ కూడా కూడా షాక్‌కి గురైయ్యారు. అందరి ప్రేమాభిమానంతో ఇప్పుడిప్పుడే బన్నీ ఈ బాధ నుంచి కోలుకుంటున్నారు’ అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక సినిమాల పరంగా అల్లు అర్జున్ నుంచి తాను చాలా నేర్చుకున్నానంది మెగా డాటర్. ‘లుక్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా సినిమాకు తన స్టైల్ మార్చుకుంటాడు. ఈ విషయంలో బన్నీనే నాకు స్ఫూర్తి’ అని నిహారిక తెలిపింది.
ఇక తన ఫ్యామిలీ హీరోలపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిహారిక. ‘పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి ఇంట్లో వాళ్ల సూచనలు, సలహాలు తీసుకుంటాను. సినిమా కథల సెలెక్షన్ లో గందరగోళానికి గురైనప్పుడు అన్న వరుణ్ తేజ్ సలహాను తీసుకుంటాను. నేను ఏ సినిమాకు సైన్ చేసినా ముందుగా అన్నతోనే డిస్కస్ చేస్తాను. ఇక రామ్ చరణ్ అన్నతో నేను చాలా జోవియల్ గా ఉంటాను. అన్నను బాగా ఆట పట్టిస్తుంటాను. అలాగే ఇంటర్వ్యూల్లో ఏ విధంగా మాట్లాడాలి? వ్యవహరించాలన్న విషయాలను రామ్ చరణ్ నుంచి నేర్చుకుంటాను’ అని నిహారిక చెప్పుకొచ్చింది.
కాగా కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్నా నిహారిక.. ‘మద్రాస్ కారన్’ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో షాన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా కానుకగా.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.మద్రాస్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
నిహారిక లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.