Game Changer: ఏపీలో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ఝలక్.. హైకోర్టు కీలక ఆదేశాలు..

ఏపీలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరలు 14 రోజుల వరకు పెంచుతూ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. టికెట్ ధరల పెంపును 10 రోజులకు మాత్రమే పరిమితం చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Game Changer: ఏపీలో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ఝలక్.. హైకోర్టు కీలక ఆదేశాలు..
Ram Charan, Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 08, 2025 | 1:24 PM

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా నాలుగైదు చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ, వెంకటేశ్ నటించిన సినిమాలు వరుసగా అడియన్స్ ముందుకు రానున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్, 12న డాకు మహారాజ్ సినిమాలు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల టికెట్ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ రోజు 1 గంటల బెనిఫిట్ షో టికెట్ 600 రూపాయలుగా నిర్ణయించింది. అలాగే డాకు మహారాజ్ బెనిఫిట్ షోకు రూ.500 పెంచుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మల్టీఫ్లెక్స్‌లో 175 రూపాయలు.. సింగిల్‌ స్క్రీన్స్‌లో 135 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్‌ ఇచ్చింది ప్రభుత్వం. జనవరి 23 వరకు టికెట్ ధర‌ పెంచుకునేందుకు వీలు కల్పించింది.

అయితే టికెట్స్ ధరలు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమాలోకు ఇలా బెనిఫిట్ షో అనుమతి ఇవ్వడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ప్రస్తావించారు పిటిషనర్. నిబంధనలకు విరుద్ధంగా ఏపీలో టికెట్ ధరలు పెంచారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థఆనం గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ మేకర్స్ కు షాకిచ్చింది.

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ ధరల పెంపుపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.14 రోజులపాటు టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ పిల్ పై విచారణ జరిపి 10 రోజులకు పరిమితం చేసింది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.