AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శుభవార్త చెప్పింది. త్వరలోనే తాను తల్లిగా ప్రమోషన్ పొందనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ బేబీ బంప్ ఫొటోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి.

Tollywood: తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jan 06, 2025 | 5:05 PM

Share

హరిప్రియ అంటే చాలామంది గుర్తు పట్టలేకపోవచ్చు కానీ నాని నటించిన పిల్ల జమీందార్ సినిమా హీరోయిన్ అంటే ఇట్టే కళ్ల ముందు మెదులుతుంది. ఇందులో అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయి సింధు పాత్రలో అద్భుతంగా నటించింది హరిప్రియ. పేరుకు కన్నడ ఇండస్ట్రీనే అయినా పక్కింటమ్మాయిలా అందరి మన్ననలు అందుకుంది. పిల్ల జమీందార్ సినిమాలో హరి ప్రియ అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. తకిత తకిట సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిందీ అందాల తార. రెండో సినిమా పిల్ల జమీందార్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా అవకాశౄలు వచ్చాయి. వరుణ్ సందేశ్‌తో కలిసి అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే బాలకృష్ణతో కలిసి జై సింహా సినిమాలో స్క్రీన్‌ షేర్ చేసుకుంది. అయితే దీని తర్వాత తెలుగు వెండి తెరపై కనిపించలేదీ అందాల తార. కానీ కన్నడ సినిమాలో మాత్రం స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. బెల్ బోటమ్, కురక్షేత్ర, పెట్రోమాక్స్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో కన్నడ ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది.

సినిమాల సంగతి పక్కన పెడితే.. హరిప్రియ 2023లో వశిష్టతో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అన్నట్లు భర్త కూడా ప్రముఖ నటుడే. కేజీఎఫ్ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించిన వశిష్ట నారప్ప, నయీం డైరీస్‌, ఓదెల రైల్వేస్టేషన్ తదితర తెలుగు సినిమాల్లో నూ యాక్ట్ చేశాడు. చివరిగా చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో వచ్చిన ఏవమ్ సినిమాలోనూ ప్రతినాయకుడిగా నటించాడు.

ఇవి కూడా చదవండి

భర్త వశిష్టతో హరి ప్రియ..

కాగా హరిప్రియ ఇప్పుడు 9 నెలల గర్భవతి. అంటే త్వరలోనే ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుందన్న మాట. తాజాగా ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో హరిప్రియ సీమంతం వే డుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.

కాగా  పిల్ల జమీందార్ సినిమాలో క్యూట్ గా కనిపించిన హరిప్రియ ఇప్పుడు కాస్త బొద్దుగా మారడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్..
లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్..
మంచి మైలేజీ ఇస్తూ దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో లభించే కార్లు
మంచి మైలేజీ ఇస్తూ దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో లభించే కార్లు
రూ. 20 కోట్ల ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీ ఎలా పంచుకుంటుంది..?
రూ. 20 కోట్ల ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీ ఎలా పంచుకుంటుంది..?
రూపాయి పతనం.. టెక్ కంపెనీలకు వరం!
రూపాయి పతనం.. టెక్ కంపెనీలకు వరం!
నెలకు రూ.50 వేల జీతం ఉంటే ఎంత లోన్ వస్తుంది..?
నెలకు రూ.50 వేల జీతం ఉంటే ఎంత లోన్ వస్తుంది..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..3800 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..3800 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్
భూమిపైనే ఉన్న అంగారక గ్రహం!మనుషులు జీవించలేని ఆవింత ద్వీపం రహస్యం
భూమిపైనే ఉన్న అంగారక గ్రహం!మనుషులు జీవించలేని ఆవింత ద్వీపం రహస్యం
ఈ 7 లావాదేవీలకు ఇకపై పాన్ కార్డ్ అవసరం లేదు.. ఇవే కొత్త నిబంధనలు
ఈ 7 లావాదేవీలకు ఇకపై పాన్ కార్డ్ అవసరం లేదు.. ఇవే కొత్త నిబంధనలు
ఒంటిపై వేలాది తేనెటీగలు.. అయినా సరే నో టెన్షన్! వీడియో వైరల్
ఒంటిపై వేలాది తేనెటీగలు.. అయినా సరే నో టెన్షన్! వీడియో వైరల్
కడప జిల్లాలో స్టార్ హీరో సినిమా షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా..
కడప జిల్లాలో స్టార్ హీరో సినిమా షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా..