AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bachchala Malli OTT: ఓటీటీలో అల్లరి నరేష్ లేటెస్ట్ సినిమా.. బచ్చలమల్లి స్ట్రీమింగ్ ఎందులోనంటే?

అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా బచ్చల మల్లి. గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రానుంది.

Bachchala Malli OTT: ఓటీటీలో అల్లరి నరేష్ లేటెస్ట్ సినిమా.. బచ్చలమల్లి స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Bachchala Malli Movie
Basha Shek
|

Updated on: Jan 05, 2025 | 8:35 PM

Share

ఒకప్పుడు కామెడీ సినిమాలతో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. కానీ అవే మూస పాత్రలు చేయడంతో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. దీంతో రూట్ మార్చి డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రమ్, ఆ ఒక్కటి అడక్కు సినిమాల తర్వాత అల్లరి నరేష్ నటించిన చిత్రం బచ్చల మల్లి. సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే డిసెంబర్ 20న విడుదలైన బచ్చల మల్లి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అల్లరి నరేష్ నటనకు కూడా మంచి పేరొచ్చింది. అయితే అప్పటికే రిలీజైన పుష్ప 2 ప్రభంజనంలో బచ్చల మల్లి సినిమా లాంగ్ రన్ ను కొనసాగించలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. బచ్చల మల్లి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. జనవరి 9 నుంచి అల్లరి నరేష్ సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సుబ్బు మంగాదేవి తెరకెక్కించిన బచ్చల మల్లి సినిమాలో హనుమాన్ బ్యూటీ అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. హరితేజ, రావు రమేశ్, సాయి కుమార్, రోహిణి, ధన రాజ్, హర్ష చెముడు, అచ్యుత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ సినిమాను నిర్మించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చోటా కే ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

బచ్చల మల్లి సినిమాలో అల్లరి నరేష్..

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..