OTT: సంక్రాంతి స్పెషల్.. ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో తెలుగు సినిమాలతో పాటు హిందీ, ఇంగ్లిష్ సినిమాలు, సిరీసులు కూడా ఉన్నాయి. అయితే ఈ వారం ఒక సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

OTT: సంక్రాంతి స్పెషల్.. ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Break Out Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2025 | 3:52 PM

సంక్రాంతి పండగను పురస్కరించుకుని పలు ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ పామ్ ఈటీవీ విన్ ఓటీటీ సంక్రాంతి బొనాంజా అంటూ ఈ నెలలో స్ట్రీమింగ్ చేయబోతున్న సినిమాల గురించి వెల్లడించింది. అందులో చాలామందిని ఆకర్షించిన సినిమా బ్రేక్ అవుట్. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్‌ ఇందులో కీలక పాత్ర పోషించాడు. సుమారు రెండేళ్ల క్రితం అంటే 2023 మార్చిలో ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. అయితే పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే కథా, కథనాల పరంగా ఈ సినిమాకు చాలా మంచి పేరొచ్చింది. ఇప్పుడీ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 09 నుంచి బ్రేక్ అవుట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంపై సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

సుబ్బు చెరుకూరి తెరకెక్కించిన బ్రేక్ అవుట్ సినిమాలో రాజా ఔతమ్ తో పాటు చిత్రం శ్రీను, కిరిటీ దామరాజు, ఆనంద చక్రపాణి, జి. బాల, రమణ భార్గవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిల్ మోదుగా నిర్మాతగా వ్యవహరించారు. ఇక బ్రేక్ అవుట్ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో మోనోఫోబియా వ్యాధి ఉన్న వ్యక్తిగా రాజా గౌతమ్ కనిపిస్తాడు. అతని లుక్‌, నటన కొత్తగా ఉంటాయి. ఒంటరిగా ఉండేందుకు భయపడే హీరో గ్యారేజ్‌లో ఎలా చిక్కుకున్నాడు? అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు? మోనోఫోబియా నుంచి కోలుకున్నాడా?లేదా? అన్నది తెలుసుకోవాలంటే బ్రేక్ అవుట్ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

జనవరి 09 నుంచి ఈటీవీ విన్ లో బ్రేక్ అవుట్ స్ట్రీమింగ్..

జనవరి నెలలో ఈటీవీ విన్  ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలివే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.