AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలయ్య ఫ్యాన్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. బాబి కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే దబిడి దిబిడి సాంగ్ ను రిలీజ్ చేశారు.

Balakrishna: దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలయ్య ఫ్యాన్స్
Balakrishna
Basha Shek
|

Updated on: Jan 06, 2025 | 10:26 AM

Share

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ , సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. కాగా దీని కంటే ముందే ‘దబిడి దిబిడి’ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజైన కొద్ది గంటల్లోనే ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తూ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అదే సమయంలో దబిడి దిబిడి సాంగ్ పై ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఇందులో బాలయ్య, ఊర్వశి రౌతేలా మాస్ స్టెప్స్ వేసి అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో కొందరు ఈ స్టెప్పులపై విమర్శలు చేస్తున్నారు. ఇదేం కొరియోగ్రఫీ అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.

కాగా దబిడి దిబిడి సాంగ్ పై వస్తోన్న ట్రోలింగ్‌ను బాలకృష్ణ అభిమానులు  తిప్పికొడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ‘గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి హిట్, పుష్ప లో అల్లు అర్జున్, రష్మిక మందన్నా సాంగ్ హిట్, డాకు మహారాజ్ డబిడి దిబిడి కూడా హిట్. ఈ మూడు సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు తిట్టారు ట్రోల్ చేశారు. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు డాకు మహారాజ్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని గుర్తు చేస్తున్నారు బాలయ్య అభిమానులు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

బాలకృష్ణ అభిమానుల ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..