Shiva Rajkumar: సర్జరీ తర్వాత మొదటిసారి బయటకు వచ్చిన శివన్న.. ఇండియాకు రావడంపై ఏమన్నారంటే?

కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌కు క్రమంగా కోలుకుంటున్నారు.. క్యాన్సర్ తో బాధపడుతోన్న ఆయనకు డిసెంబర్ నెలాఖరులో అమెరికాలో శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నాడు శివన్న. అలా తాజాగా ఆయనకు సంబంధించిన కొత్త ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Shiva Rajkumar: సర్జరీ తర్వాత మొదటిసారి బయటకు వచ్చిన శివన్న.. ఇండియాకు రావడంపై ఏమన్నారంటే?
Shiva Rajkumar
Follow us
Basha Shek

|

Updated on: Jan 05, 2025 | 9:09 PM

క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం డిసెంబర్ 18న శివరాజ్‌కుమార్ అమెరికా వెళ్లారు. డిసెంబరు 24న అమెరికాలోని ఫ్లోరిడాలోని మియామీ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. సుమారు నాలుగైదు గంటలపాటు శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఆసుపత్రికి సమీపంలోని ఓ హోటల్‌లో శివన్న కనిపించాడు. అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఆయన నిల్చున్న ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. క్యాన్సర్ సర్జరీ విజయవంతమైనప్పటికీ, కొద్దిరోజుల పాటు శివన్న అక్కడే ఉండనున్నారు. జనవరి 24 వరకు శివరాజ్‌కుమార్‌ అమెరికాలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్నారు. ఆపైనే ఆయన సినిమా షూటింగుల్లోకి రానున్నారు. ఇటీవల శివరాజ్‌కుమార్, గీతా శివరాజ్‌కుమార్ లైవ్‌ ద్వారా అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. తనకు జరిగిన క్యాన్సర్ సర్జరీ గురించి శివన్న మాట్లాడాడు. క్యాన్సర్ ను పూర్తిగా జయించానని ఆయన చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా ఈ ట్రీట్ మెంట్ కోసమే శివరాజ్‌కుమార్ నటనకు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆరోగ్యంపైనే పూర్తి శ్రద్ధ చూపుతున్నారు. హోమ్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘భైరతి రంగల్‌’ సినిమా పనులను పూర్తి చేసిన తర్వాతే అమెరికాకు వెళ్లారాయన. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ’45’ సినిమా పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ఆర్ సీ 16లోనూ శివన్న ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీక పూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఫ్యామిలీతో శివరాజ్ కుమార్..

శివన్న ఎమోషనల్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.