Tollywood: ‘ఎప్పటికైనా సీఎం అవ్వాలన్నది నా కల’.. స్టార్ హీరోయిన్‌ ఊహించని కామెంట్స్

తమిళనాడులో జయలలిత తరువాత మరో మహిళ ముఖ్యమంత్రి కాబోతున్నారా ? నటి త్రిష కామెంట్స్ అలాంటి చర్చనే లేవనెత్తాయి.. రాజకీయాలంటే తనకు చాలా ఇష్టమన్నారు త్రిష.. తమిళనాడుకు సీఎం కావాలన్నదని కల అని ప్రకటించారు.. దీంతో త్రిష పొలిటికల్‌ ఎంట్రీపై జోరుగా చర్చ జరుగుతోంది.

Tollywood: 'ఎప్పటికైనా సీఎం అవ్వాలన్నది నా కల'.. స్టార్ హీరోయిన్‌ ఊహించని కామెంట్స్
Trisha Krishnan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 05, 2025 | 8:47 PM

తమిళనాట జయలలిత తరువాత మరో మహిళ సీఎం కాబోతున్నారా ? హీరోయిన్‌ త్రిష పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారా ? తనకు సీఎం పదవి చేపట్టాలన్న కల ఉందని త్రిష చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గత 20 ఏళ్ల నుంచి తన స్టార్‌డమ్‌ను కాపాడుకుంటున్నారు త్రిష. 40 ఏళ్ల వయస్సులో కూడా ఆమె ఐదు సినిమాల్లో నటిస్తున్నారు.. ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమని త్రిష అభిప్రాయపడుతున్నారు. ఆమె వ్యాఖ్యలు తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. త్రిష లాంటి సూపర్‌స్టార్‌డమ్‌ ఉన్న కథానాయిక రాజకీయ కోణంలో చేసిన వ్యాఖ్యలను అంత ఈజీగా కొట్టి పారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు.

తమిళనాట రాజకీయాలు, సినిమాలకు విడదీయరాని సంబంధం ఉంది. అగ్ర హీరో దళపతి విజయ్‌ సైతం సినిమాల నుంచి తప్పుకొని సొంత పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ సమయంలో త్రిష వ్యాఖ్యలు తమిళనాట ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి చాలా ఉందన్న త్రిష.. ఏదో ఒకరోజు తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది. త్రిష కామెంట్స్ చూస్తుంటే ఆమె వచ్చే ఎన్నికల టైమ్ నాటికి రాజకీయాల్లోకి రావడం ఖాయంగానే కనిపిస్తుంది. త్రిష కూడా విజయ్ కు మంచి ఫ్రెండ్ . మరి ఆమె భవిష్యత్తులో విజయ్ పార్టీలో చేరుతుందా లేకా కొత్త పార్టీ ఏమైనా పెడుతుందా అన్నది చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.