Nikhil Siddhartha: తెలంగాణ గవర్నర్‌ను ప్రత్యేకంగా కలిసిన హీరో నిఖిల్.. కారణమేంటంటే?

కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం నిఖిల్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అయితే తాజాగా ఈ యంగ్ హీరో తెలంగాణ గవర్నర్ ను ప్రత్యేకంగా కలిశాడు.

Nikhil Siddhartha: తెలంగాణ గవర్నర్‌ను ప్రత్యేకంగా కలిసిన హీరో నిఖిల్.. కారణమేంటంటే?
Actor Nikhil Siddhartha
Follow us
Basha Shek

|

Updated on: Jan 05, 2025 | 8:34 PM

కార్తికేయ 2 సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నిఖిల్ సిద్ధార్థ్. అయితే దీని తర్వాత నిఖిల్ నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. స్పై ఫ్లాప్ గా నిలిచింది. 18 పేజేస్ యావరేజ్‌ గా నిలిచింది. ఇక ఇటీవల రిలీజైన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ కూడా ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఇప్పుడు స్వయంభూ అంటూ మరో పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు వస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లో సంయుక్తా మేనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన స్టిల్స్ అంచనాలు పెంచేశాయి. త్వరలోనే స్వయంభూ నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. కాగా ప్రస్తుతం సినిమా షూటింగులతో బిజీగా ఉంటోన్న నిఖిల్ తాజాగా లంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మను ప్రత్యేకంగా కలిశారు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. గవర్నర్ తో భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

‘తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులైన జిష్ణు దేవ్ వర్మ జీతో సమావేశం ఎంతో అద్భుతంగా సాగింది. సినిమా నుంచి జాతీయ ఐక్యత వరకు వాటికి సంబంధించిన వివరాల గురించి ఆయన మాట్లాడారు. దీన్ని సాకారం చేసినందుకు అమరవాణి ఫౌండేషన్, మదన్ గోసావి జీ, సాకేత్ జీ అండ్ కృష్ణ చైతన్యలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశాడు నిఖిల్. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నిఖిల్ ఏ సందర్భంలో గవర్నర్ ను కలిశాడో ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ గవర్నర్ తో హీరో నిఖిల్..

బిడ్డతో నిఖిల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.