Ram Charan-Balakrishna: క్లింకార ఫోటో రివీల్ చేసేది అప్పుడే.. బాలయ్య షోలో రామ్ చరణ్ అల్లరి.. నవ్వులే నవ్వులు.. ప్రోమో చూశారా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్, దిల్ రాజు ఇటీవల అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న ఈ టాక్ షోలో రామ్ చరణ్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది.
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. టాలీవుడ్ ప్రోడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అలాగే ఇందులో అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. జనవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఇటీవలే రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్, బాలయ్య ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన అంత అఫుల్ ఎంటర్టైన్మంట్ సరదా సరదాగ సాగింది. చరణ్ తల్లి, నాన్నమ్మ వీడియో కాల్ లో మాట్లాడారు. ఆ తర్వాత చరణ్ స్నేహితుడు శర్వానంద్ సైతం వచ్చి తన ఫ్రెండ్షిప్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
అలాగే తన కూతురు క్లింకార గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్. మా పాప నాన్న అని పిలిచిన రోజు తప్పకుండా ఫోటో రివీల్ చేస్తాను అని అన్నారు. సురేఖ, అంజనా దేవి పంపిన వీడియో సందేశాన్ని ప్లే చేశారు బాలయ్య. తమకు కావాల్సిన విషయాన్ని లెటర్ ద్వారా పంపించారు. 2025లో తమకు వారసుడు కావాలని కోరుకున్నారు. ఇక పార్టీకి తన మామయ్య అల్లు అరవింద్ తో వెళ్లడం ఇష్టమని చెప్పారు. ఇదే షోలో అటు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ప్రభాస్ కు ఫోన్ చేయడంతో కాసేపు చరణ్ ను ఆడుకున్నారు బాలయ్య. మొత్తానికి తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం నవ్వులతో సరదాగా సాగిపోయింది.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.