Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daaku Maharaaj: బాలయ్య సినిమాలో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రం డాకు మహారాజ్. బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఒక కీలక పాత్రలో నటించాడు.

Daaku Maharaaj: బాలయ్య సినిమాలో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?
Daaku Maharaaj
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2025 | 2:24 PM

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా డాకూ మహరాజ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే చాందినీ చౌదరి ఓ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. వీరితో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్ లో బాలయ్యతో కలిసి చిందులేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ ,గ్లింప్స్, ట్రైలర్ బాలయ్య అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా డాకు మహారాజ్ సినిమాలో ఒక టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఓ కీలక పాత్రలో కనిపించనన్నాడు. అతను మరెవరో కాదు.. ఇటీవల పెళ్లి చేసుకున్న కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్. తన మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న ఈ ట్యాలెంటెడ్ దర్శకుడు బాలయ్య సినిమాలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన ‘డాకు మహారాజ్’ ట్రైలర్‌లో తాను కనిపించిన ఫ్రేమ్‌ను అందరితో షేర్‌ చేసుకున్నాడు. బాలయ్య సినిమాలో తనకు అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేసిన సందీప్ తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

‘ విజయవాడకు చెందిన నేను పాఠశాలకు వేళ్లేటప్పటి నుంచే సినిమాల్లోకి రావాలని కలలు కన్నాను. బాలయ్య బాబు సినిమాతో ఇప్పుడు నటుడిగా పరిచయం కావడంతో సంతోషంగా ఉంది. నా కల సాకారమయ్యేందుకు కృషి చేసిన బాబీ అన్నకి రుణపడి ఉంటాను. అలాగే సినిమా డైరెక్టర్ నాగవంశీకి ధన్యవాదాలు’ అని సందీప్ రాజ్ ట్వీట్ చేశాడు. దీనిపై దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కూడా స్పందించారు. ‘‘బిగ్‌ ఫిల్మ్‌ కోసం ఫస్ట్‌ ఆడిషన్‌ చేసింది ఎవరు బాబు..? సందీప్‌.. నీ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. అద్భుతమైన విజువల్స్‌తో బాబీ అదరగొట్టేశారు. నట సింహాం బాలకృష్ణ ప్రదర్శన నెక్ట్స్ లెవెల్ అంతే.. తమన్‌ బావా.. బాలయ్య అంటే నీకు పూనకాలు వచ్చేస్తాయి కదా’ అని హరీశ్ శంకర్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

సందీప్ రాజ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.