AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashanth Varma: ఆర్జీవీ డెన్‌ను తలదన్నేలా  ప్రశాంత్ వర్మ కొత్త ఆఫీస్‌! ఏకంగా అన్ని కోట్లతో!

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడీ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేతిలో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ తో పాటు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంది.

Prashanth Varma: ఆర్జీవీ డెన్‌ను తలదన్నేలా  ప్రశాంత్ వర్మ కొత్త ఆఫీస్‌! ఏకంగా అన్ని కోట్లతో!
Director Prashanth Varma
Basha Shek
|

Updated on: Jan 08, 2025 | 1:30 PM

Share

సినిమా దర్శకులు, నిర్మాతలకు ప్రత్యేక ఆఫీసు ఉండడం మామూలే. టాలీవుడ్ లో చాలా మంది దర్శక నిర్మాతలకు ఇల్లు కాకుండా తమ సినిమా పనుల కోసం సొంత ఆఫీసులు నిర్మించుకున్నారు. ఇంకొందరు అద్దె ఇళ్లలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొందరు తమ ఇంట్లోనే ఒక గదినే ఆఫీస్‌గా మార్చుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమా పనుల కోసం ఒక పెద్ద ఆఫీస్‌ను నిర్మించుకుంటున్నాడట. ఇందుకోసం ఏకంగా రూ. 30 కోట్లు వెచ్చిస్తున్నాడని సినిమా సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. ప్రశాంత్ వర్మ హైదరాబాద్‌లో తన కోసం ఒక ప్రత్యేక ఆఫీస్‌ను నిర్మిస్తున్నాడట. తెలుగులో ఏ దర్శకుడూ లేని విధంగా విలాసవంతమైన, అన్ని వసతులు ఉండేలా తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడట. ఇప్పటికే తన ఆఫీస్‌ కు సంబంధించిన బ్లూప్రింట్ కూడా సిద్ధమైందట. హైదరాబాద్‌లోని కాచిగూడ ప్రాంతంలో ప్రశాంత్ వర్మ తన ఆఫీస్‌ని నిర్మిస్తున్నాడట. ఈ ఆఫీసు చాలా పెద్దదిగా ఉంటుందట. సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కి అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా ఈ ఆఫీసులో ఉంటాయట. ఈ కార్యాలయంలోనే VFX యూనిట్, డబ్బింగ్ యూనిట్, పెద్ద హోమ్ థియేటర్, రచయితల కోసం ప్రత్యేక లగ్జరీ గది, ఎడిటింగ్ యూనిట్, మ్యూజిక్ స్టూడియో తో పాటు సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా ఈ ఆఫీసులో ఉండనున్నాయి.

గతంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించుకున్న ఆఫీస్ పలు వార్తల్లో నిలిచింది. రామ్ గోపాల్ వర్మ తన కోసం ‘డెన్’ పేరుతో బహుళ అంతస్తుల కార్యాలయాన్ని నిర్మించుకున్నాడు. చాలా మంది హీరోయిన్ల ఫొటోలతో ఈ డెన్ ను అందంగా మల్చుకున్నాడు ఆర్జీవీ. ఇప్పుడు దీనిని తలదన్నేలా తన ఆఫీస్ ను నిర్మిస్తున్నాడట ప్రశాంత్ వర్మ.

ఇవి కూడా చదవండి

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయారు. ఇప్పుడీ క్రేజీ డైరెక్టర్ చేతిలో పలు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ఒకటి. ఇందులో కాంతార ఫేమ్ రిషభ్ శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే బాలకృష్ణ కుమారుడి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ని కూడా ప్రశాంత్ డైరెక్ట్ చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాపై మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..