AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాఫ్ట్‌వేర్ జాబ్ మానేసి ఇండస్ట్రీలోకి.. పవన్, నితిన్‌లతో సినిమాలు.. ఈ తెలుగు హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

సాధారణంగా సినిమా హీరోయిన్లు మోడల్ గా కెరీర్ ప్రారంభిస్తారు. అందాల పోటీల్లో అదృష్టం పరీక్షించుకుంటారు. ఆ తర్వాతే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. కానీ కొందరు అనుకోకుండా హీరోయిన్స్ అవుతారు. పై ఫొటోలో ఉన్న తెలుగు హీరోయిన్ సరిగ్గా ఈ కోవకే చెందుతుంది.

సాఫ్ట్‌వేర్ జాబ్ మానేసి ఇండస్ట్రీలోకి.. పవన్, నితిన్‌లతో సినిమాలు.. ఈ తెలుగు హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jan 08, 2025 | 12:12 PM

Share

‘డాక్టర్ కావాల్సింది అనుకోకుండా యాక్టర్ అయ్యాం’ సినిమా ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్ల నోటి నుంచి తరచు వచ్చే మాట ఇది. అయితే ఈ అందాల తార కాస్త డిఫరెంట్. తెలంగాణలోనే పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇంకేముంది లక్షల జీతం.. అందులోనూ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ జాబ్.. వేరొకరు లైఫ్ సెటిల్ అని రిలాక్స్ అయిపోతారు. కానీ ఈ సొగసరి మాత్రం డిఫరెంట్ గా ఆలోచించింది. సినిమాలపై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసింది. షార్ట్ ఫిల్మ్స్ తో మరో కొత్త జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ అనతికాలంలోనే తెలుగు నాట క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు సహాయనటిగా ఇతర హీరోల సి చిత్రాల్లోనూ మెప్పిస్తోందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగు నాట క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు అ నన్య నాగళ్ల. ఇవాళ (జనవరి 09) ఆమె పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ బ్యూటీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో అనన్యకు సంబంధించిన చిన్ననాటి అరుదైన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తు పల్లికి చెందిన అనన్య హైదరాబాద్ లో నే బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో కూడా చేరింది. అయితే జాబ్ చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత ప్రియదర్శితో కలిసి మల్లేశం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి, పొట్టేల్, తంత్ర తదితర సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

అనన్య నాగళ్ల లేటేస్ట్ ఫొటోస్..

ఇక ఇటీవల అనన్య నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆమె పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

సినిమా ప్రమోషన్లలో అనన్య..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!