Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK: కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు.. బాలయ్య షోలో రామ్ చరణ్

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నఅన్ స్టాపబుల్ విత్ ఎన్సీకే కు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ టాక్ షోలో చాలామంది సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను ఓపెన్‌ గా పంచుకుంటున్నారు. దీంతో బాలయ్య షోకు రికార్డు వ్యూస్ వస్తున్నాయి.

Unstoppable with NBK: కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు.. బాలయ్య షోలో రామ్ చరణ్
Ram Charan, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Jan 09, 2025 | 9:27 PM

బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న అన్ స్టాపబుల్ విత్ ఎన్సీకే షో లేటెస్ట్ ఎపిసోడ్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. తన గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ టాక్ షోకు వచ్చిన చరణ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులతో తనకున్న అనుబంధంపై ఓపెన్ అయిపోయాడు. షోలో భాగంగా బాలకృష్ణ చిరంజీవి, నాగబాబు, పవన్ కలిసి ఉన్న ఫొటోని చూపించి వాళ్ల ముగ్గురి గురించి పలు ప్రశ్నలు అడిగారు. వీటికి రామ్ చరణ్ ఆసక్తికర సమాధానాలిచ్చాడు. ‘నాన్న సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో నేను చిన్నప్పుడు పవన్ కల్యాణ్ బాబాయ్ తోనే అన్నీ షేర్ చేసుకునే వాడిని. నాన్న కూడా నా బాధ్యతలను కల్యాణ్ బాబాయికే అప్పచెప్పే వారు. ట్యూషన్స్ నుంచి హార్స్ రైడింగ్ వరకు అన్నీ బాబాయినే తీసుకెళ్లేవారు. ఇంటికి వచ్చాక మాత్రం ఫుడ్, స్టడీస్, హోమ్ వర్క్ ఇతర బాధ్యతలు నాగ్ బాబాయి చూసుకునే వారు. ఏదైమైనా నా చిన్నప్పుడు ఎక్కువ సమయం కళ్యాణ్ బాబాయ్ తోనే గడిపాను’

‘ఏ విషయంలోనైనా ఓపిక ఉండాలని సలహా ఇచ్చారు కళ్యాణ్ బాబాయ్. నిజంగా ఆయనకు చాలా ఓపిక. దేన్నైనా భరిస్తారు. భరించే తత్త్వం నేను ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నాను. నాన్న అయితే పెద్దలకు మర్యాద, గౌరవం ఇవ్వమని చెపుతారు. ఆ విషయంలో తేడా వస్తే అసలు ఊరుకోరు. నాగబాబు బాబాయ్ చాలా జోవియల్ గా ఉంటారు. ఆయన వేసే జోకులకు పడీ పడీ నవ్వుతాం. డాడీ, కళ్యాణ్ బాబాయ్ బాగా సైలెంట్. నాగబాబు బాబాయ్ మాత్రం సరదా మనిషి. కళ్యాణ్ బాబాయ్ లెగో బొమ్మలు, బుక్స్ లతోనే తన సమయాన్ని గడిపేవారు. ఆయన దగ్గర రెండు రూమ్స్ కలెక్షన్ బుక్స్ ఉన్నాయి’ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

బాలయ్య అన్ స్టాప బుల్ షోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..

బాబాయ్ పిలుపులోనే స్వింగ్ ఉంది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సింహాచలంలో చందనోత్సవం.. అప్పన్న నిజ రూప దర్శనం ఎప్పుడంటే..
సింహాచలంలో చందనోత్సవం.. అప్పన్న నిజ రూప దర్శనం ఎప్పుడంటే..
తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అప్పుడే మొదలైన పవర్ పాలిటిక్స్
తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అప్పుడే మొదలైన పవర్ పాలిటిక్స్
ఇంత అందం మనోళ్లు ఎలా మిస్ అయ్యారు మావ..!
ఇంత అందం మనోళ్లు ఎలా మిస్ అయ్యారు మావ..!
MS Dhoni: రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేసిన ధోని.. ఏమన్నాడంటే?
MS Dhoni: రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేసిన ధోని.. ఏమన్నాడంటే?
నజ్రియా, ఫహద్ ఫాజిల్ కలవడానికి ఆ హీరోయిన్ కారణం..
నజ్రియా, ఫహద్ ఫాజిల్ కలవడానికి ఆ హీరోయిన్ కారణం..
JEE మెయిన్ 2025లో 2,50,236 మందిపాస్.. 2రోజుల్లో అడ్వాన్స్‌డ్ షురూ
JEE మెయిన్ 2025లో 2,50,236 మందిపాస్.. 2రోజుల్లో అడ్వాన్స్‌డ్ షురూ
గోల్డ్ లవ్స్ ఇది విన్నారా.! హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతుందంటే.?
గోల్డ్ లవ్స్ ఇది విన్నారా.! హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతుందంటే.?
నంబర్ 1ను ఢీ కొట్టనున్న నంబర్ 7.. ఓడితే లగేజ్ సర్దేయాల్సిందే
నంబర్ 1ను ఢీ కొట్టనున్న నంబర్ 7.. ఓడితే లగేజ్ సర్దేయాల్సిందే
భారత్‌లో పర్యటించనున్న జేడీ వాన్స్‌.. నేడు ప్రధాని మోడీతో భేటీ..
భారత్‌లో పర్యటించనున్న జేడీ వాన్స్‌.. నేడు ప్రధాని మోడీతో భేటీ..
భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ..
భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ..