Tollywood: భార్య ఫోన్లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. ? ఓటీటీలో సన్పెన్స్ థ్రిల్లర్ మూవీ..
ఇటీవల కాలంలో ఓటీటీ సినీ ప్రియులు సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ కంటెంట్ చిత్రాలు చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్షణ క్షణం భయంకరమైన విజువల్స్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో సాగే సినిమాలకు రోజు రోజుకీ మరింత ఆదరణ పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్.
తమిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇటీవల కొన్నాళ్లుగా దక్షిణాదిలో థ్రిల్లింగ్ మూవీస్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అందులో అథోముగం ఒకటి. ప్రస్తుతం ఐఎమ్డీబీలో 7 రేటింగ్ కలిగి ఉంది. అగ్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తమిళంలో నిర్మించింది. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ దేవ్ దర్శకత్వం వహించారు. గతేడాది మార్చి 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో సిద్ధార్థ్, చైతన్య ప్రతాప్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇదే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు ఈ ఇద్దరూ. తమిళంతోపాటు మలయాళంలో ఒకేరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అనంత్ నాగ్, అరుణ్ పాండియన్ కీలకపాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే.. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. జనవరి 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తమిళంలో స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే ఆహా తమిళంలో మాత్రం ఈ చిత్రం ఫ్రీ స్ట్రీమింగ్ రూపంలో అడియన్స్ ముందుకు వస్తుంది. థియేటర్లలో విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.
కథ విషయానికి వస్తే..
మార్టిన్ (సిద్ధార్థ్) లీనా (చైతన్య ప్రతాప్) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. సిద్ధార్థ్ ఓ టీ ఎస్టేట్ లో పనిచేస్తుండగా.. తన భార్య లీనాను తమ వెడ్డింగ్ యానివర్సరీకి సర్ ప్రైజ్ చేయాలనుకుంటాడు. దీంతో ఆమె ఫోన్ లో తనకు తెలియకుండా హిడెన్ ఫేస్ అన స్పై యాడ్ డౌన్ లోడ్ చేస్తాడు. ఆ యాప్ ద్వారా లీలా ఏం చేస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటాడు. అప్పుడే లీనా గురించి సిద్ధార్థ్ ఓ విషయం తెలుసుకుంటాడు. దీంతో సిద్ధార్థ్, లీనా జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ? చివరకు ఏం జరిగిందనేది సినిమా.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.