- Telugu News Photo Gallery Cinema photos Heroines who may get married in 2025 Rashmika Mandanna, Tamannaah Bhatia and Janhvi Kapoor
2025 పెళ్లికి సిద్ధమవుతున్న ముగ్గురు హీరోయిన్లు
ఇండస్ట్రీలో ఈ మధ్య పెళ్లి సందడి ఎక్కువగా కనిపిస్తుంది. స్టార్ హీరోయిన్లు వరసగా ఓ ఇంటి వారవుతున్నారు. ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటూ మిస్ నుంచి మిసెస్ అవుతున్నారు. ఇదే ట్రెండ్ 2025లోనూ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది. ఈ ఏడాది మరో ముగ్గురు నలుగురు స్టార్ హీరోయిన్లు పెళ్లి పీటలెక్కేలా కనిపిస్తున్నారు. మరి వాళ్లెవరు..?
Updated on: Jan 10, 2025 | 1:03 PM

ఈ మధ్య ఇండస్ట్రీలో పెళ్లి బాజాల సౌండ్ ఎక్కువైంది. కుమారి నుంచి శ్రీమతులుగా మారిపోతున్నారు మన హీరోయిన్లు. గత రెండేళ్లలో కీర్తి సురేష్, రకుల్, కాజల్ ఇలా చాలా మంది బ్యూటీస్ పెళ్లి చేసుకున్నారు. 2025లోనూ ఈ సీన్ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది. ఈ రేసులో అందరికంటే ముందున్నది తమన్నానే.

అన్నీ కుదిర్తే ఇదే ఏడాది అమ్మడు పెళ్లి పీటలెక్కడం ఖాయం. కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారు తమన్నా.

ఈ ఇద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2లో నటించారు కూడా. అందులో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. త్వరలోనే తమన్నా, విజయ్ పెళ్లి జరగబోతుందనే ప్రచారం జరుగుతుంది.

మరోవైపు జాన్వీ కపూర్ కూడా తన ప్రియుడు శిఖర్ పహారియాను పెళ్లాడే ఛాన్స్ లేకపోలేదు. ప్రియుడితో కలిసి పూజలు చేయడమే కాదు.. తిరుమలకు కూడా వచ్చారు జాన్వీ కపూర్. 2025లోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని తెలుస్తుంది.

మరోవైపు రష్మిక మందన్న పెళ్లిపై చర్చ జరుగుతుంది. ఓ తెలుగు నటుడితో ఈమె ప్రేమలో ఉందనే విషయం నిర్మాత నాగవంశీ కూడా మొన్న అన్‌స్టాపబుల్‌లో చెప్పారు.. ఆ నటుడెవరో చెప్పనక్కర్లేదంటూ బాలయ్య నవ్వేసారు కూడా.

విజయ్ దేవరొకండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది.. కానీ దీనిపై ఇద్దరూ స్పందించలేదు. అయితే నాగవంశీ చెప్పిన ఆ తెలుగు నటుడితో రష్మిక ఈ ఏడాది పెళ్లి పీటలెక్కే ఛాన్స్ ఉందా అని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈమె హిందీలో చావా, తామ, సికిందర్‌తో బిజీగా ఉన్నారు.




