- Telugu News Photo Gallery Cinema photos Movies and Webseries which will be streaming on OTT in New Year second week
OTT Releases: ఈ వారం ఓటీటీలో చిన్న సినిమాల సందడి.. వెబ్ సిరీస్లు తాకిడి..
2025 వచ్చి రెండో వారం వచ్చేసింది. సంక్రాంతి సినిమాలు కూడా థియేటర్లలో ఒక దాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. మరి డిజిటల్ లో సందడి చేస్తున్న సినిమాలు ఏంటి.? వెబ్ సిరీస్లు ఏంటి.? ఎప్పుడు వస్తున్నాయి.? ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయి.? ఇలాంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం రండి..
Updated on: Jan 10, 2025 | 1:08 PM

'35 ఇది చిన్న కథ కాదు' ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన రోమాంటిక్ చిత్రం 'నీలిమేఘశ్యామ'. ఈ సినిమా నేరుగా ఆహా వేదికగా జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. రోమాంటిక్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అలాగే హైడ్ ఎన్ సీక్ అనే మరో సినిమా కూడా జనవరి 10 నుంచి ఆహాలో ప్రసారం కానుంది.

ETV విన్ వేదికగా కూడా ఈ వారం రెండు సినిమా స్ట్రీమ్ అవుతున్నాయి. అందులో ఒకటి 'బ్రేక్ అవుట్' అనే సినిమా జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా తెరకెక్కిన మాస్ యాక్షన్ సినిమా 'బచ్చల మల్లి' జనవరి 10 నుంచి అందుబాటులో ఉండనుంది.

జీ5 వేదికగా జనవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ది హిందీ సినిమా 'ది సబర్మతి రిపోర్ట్'. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో '12త్ ఫెయిల్' ఫేమ్ విక్రాంత్ మస్సె, రాశి ఖన్నా, రిద్ధి డోగ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. పొలిటికల్ డ్రామా ఇష్టపడేవారు ఇది తప్పక చుడండి.

విక్రమాదిత్య మోత్వానే జైలు డ్రామా సిరీస్ 'బ్లాక్ వారెంట్' జహాన్ కపూర్ డిజిటల్ డెబ్యూ ఇస్తున్న సిరీస్ ఇది. తీహార్ జైలు ఖైదీలు మరియు జైలు సూపరింటెండెంట్ మధ్య జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా వస్తుంది. ఈ సిరీస్ జనవరి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.

'గూస్‌బంప్స్: ది వానిషింగ్' అనేది రాబ్ లెటర్‌మాన్, నికోలస్ స్టోలర్ అభివృద్ధి చేసిన ఒక అమెరికన్ హారర్ సిరీస్. ఇది డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా జనవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది 2023లో వచ్చిన 'గూస్‌బంప్స్' సిరీస్కి సెకండ్ సీజన్.





























