- Telugu News Photo Gallery Cinema photos Actor Sai Kiran shares his wedding photos with Koilamma serial actress Sravanti
Sai Kiran: ‘కోయిలమ్మ’ నటి మెడలో సాయి కిరణ్ మూడు ముళ్లు.. పెళ్లి ఫొటోలు ఇదిగో
సినిమాలు, సీరియల్స్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు నటుడు సాయి కిరణ్. ఇటీవల అతను కోయిలమ్మ నటి స్రవంతితో కలిసి పెళ్లిపీటలెక్కాడు. తాజాగా తమ పెళ్లి ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుని మురిసిపోయాడీ నటుడు. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
Updated on: Jan 10, 2025 | 2:00 PM

లెజెండరీ సింగర్ పి.సుశీలకు మనవడు వరసయ్యే సాయికిరణ్ హీరోగా, సహాయక నటుడిగా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు.

నువ్వే కావాలి సినిమాతో సాయి కిరణ్ కుమంచి గుర్తింపు వచ్చింది. అలాగే లయతో కలిసి ప్రేమించు సినిమాలో నటించి సోలో హీరోగా సక్సెస్ కొట్టాడు.

ఇక మనసుంటే చాలు', 'ఎంత బావుందో తదితర చిత్రాల్లోనూ సాయి కిరణ్ నటించాడు. అయితే ఆ తర్వాత కంటిన్యూ చేయలేకపోయాడు.

ప్రస్తుతం బుల్లితెరపై బిజీ బిజీగా ఉంటున్నాడు సాయి కిరణ్. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం సీరియల్స్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

గతేడాది డిసెంబర్ లో తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్‌లో నటించిన స్రవంతితో కలిసి పెళ్లిపీటలెక్కాడు సాయికిరణ్. ఈ వేడుకకు మహేశ్వరితో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

తాజాగా తమ పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు సాయి కిరణ్. దీంతో ఇవి ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు




