రీ రిలీజ్ సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ చూసాక.. అస్సలు ఆగట్లేదు నిర్మాతలు. క్లాసిక్స్ అన్నింటికీ మరోసారి దుమ్ము దులుపుతున్నారు. చెక్ దే ఇండియా, లగాన్, బివి నెం 1, రబ్ నే బనాదీ జోడీ, అజబ్ ప్రేమ్‌కీ గజబ్ కహానీ లాంటి సినిమాలను త్వరలోనే మళ్లీ విడుదల చేయబోతున్నారు. మొత్తానికి బాలీవుడ్‌లోనూ రీ రిలీజ్ ట్రెండ్ పరుగులు పెడుతుందిప్పుడు.