- Telugu News Photo Gallery Cinema photos Even if it is a young hero or a star hero, if it comes with those two genres, the movie will be a hit
Movie News: సూపర్ నేచురల్స్తో కుర్ర హీరోలు.. రియలిస్టిక్ కథలతో స్టార్ హీరోలు..
రీసెంట్ టైమ్స్‌లో సినిమా కథల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. కుర్ర హీరోలు సూపర్ నేచురల్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు వస్తుంటే.. టాప్ స్టార్స్ మాత్రం రియలిస్టిక్ కథలను వెండితెర మీద చూపించేందుకు ట్రై చేస్తున్నారు. ఈ రెండు జానర్లను సమానంగా ఆదరిస్తున్నారు మన ఆడియన్స్.
Updated on: Jan 10, 2025 | 1:45 PM

ఈ మధ్యకాలంలో వెండితెర మీద ఫాంటసీ సినిమాలో జోరు గట్టిగా కనిపిస్తోంది. హనుమాన్‌తో తేజ సజ్జ సూపర్ హీరో కాన్సెప్ట్‌ను తెర మీదకు తీసుకువచ్చారు. నెక్ట్స్ మూవీ మిరాయ్‌ని కూడా అదే జానర్‌లో ట్రై చేస్తున్నారు తేజ.

కుర్ర హీరోలకు పోటిగా మరోసారి జగదేక వీరుడు స్టైల్‌లో విశ్వంభర అనే ఫాంటసీ మూవీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రంలో త్రిష కథానాయకిగా నటిస్తుంది. ఈ సినిమాను సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

వరుసగా డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్న నిఖిల్ కూడా స్వయంభూ అనే ఫోక్‌లోర్ మూవీలో నటిస్తున్నారు. మైథలాజికల్ కథతో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు మంచు విష్ణు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కన్నప్పాలో నంది పాత్రలో ఆకట్టుకోనున్నారు.

హరి హర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ సినిమా మార్చ్ 28న ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్.

ఓ వైపు ఇలా పాంటసీ, ఫోక్‌లోర్ సినిమాల ట్రెండ్ గట్టిగా నడుస్తుంటే మరో వైపు రియలిస్టిక్ కథలు కూడా సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేస్తున్నాయి. దేవర, పుష్ప సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్ లార్జెర్ దన్ లైఫ్ అన్నట్టుగా కనిపించినా... సినిమా నేపథ్యం అంతా చాలా రియలిస్టిక్‌గానే సాగుతుంది. ఇలా ఫాంటసీ, ఫోక్‌లోర్, రియలిస్టిక్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో సిల్వర్ స్క్రీన్ మీద కొత్త జోష్ కనిపిస్తోంది.




