OTT: 5 కోట్లతో తీస్తే 60 కోట్లు.. ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జనవరి 10) కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అందులోనూ తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్ సినిమాలు, సిరీస్ లున్నాయి. అయితే శనివారం నుంచి (జనవరి 11) మరో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
మలయాళ బ్యూటీ, ఎక్స్ ప్రెషన్ క్వీన్ నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సూక్ష్మ దర్శిని. ఎంసీ జితీన్ తెరకెక్కించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో జయ జయ జయ జయ హే ఫేమ్ బాసిల్ జోసెఫ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. గతేడాది నవంబర్ 22న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందించింది. ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 60 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. మిస్టరీ థ్రిల్లర్ సీన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే థియేటర్ లో ఆడియన్స్ ను కట్టి పడేసిన సూక్ష్మ దర్శిని సినిమా ఓటీటీలో రిలీజ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అందులో తెలుగు ఆడియెన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది. సూక్ష్మ దర్శిని సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. శనివారం అర్ధరాత్రి నుంచే ఈ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ బ్లాక్ బస్టర్ మూవీ అందుబాటులో ఉంది.
సూక్ష్మదర్శిని సినిమాలో నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్ అద్భుతంగా నటించారు. వీరితో పాటు అఖిలా భార్గవన్, మెరిన్ ఫిలిప్, పూజ మోహన్ రాజ్, దీపక్ పరంబోల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏవీఏ ప్రొడక్షన్స్, హ్యాపీ హవర్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై ఏవీ వినూప్, షైజు, సమీర్ ఈ సినిమాను నిర్మించారు. క్రిష్టో జేవియర్ సంగీతం అందించారు. మరి ఈ వీకెండ్ లో మంచి థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే సూక్ష్మ దర్శిని మీకు మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..
#Sookshmadarshini is now streaming on Disney+ Hotstar in Malayalam, Hindi, Tamil, Telugu, and Kannada.#DisneyPlusHotstar #DisneyPlusHotstarMalayalam #NazriyaNazim #BasilJoseph #Crime #Thriller #Comedy #Suspense #Humour #Drama #MalayalamMovie #Investigation #MysteryThriller pic.twitter.com/RuxeFnZ0PV
— DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) January 11, 2025
సూక్ష్మ దర్శిని సినిమా ట్రైలర్..
Presenting the official trailer of Sookshmadarshini starring Nazriya Nazim and Basil Joseph. Streaming exclusively on Disney+ Hotstar from January 11.@NazriyaFahadh @sidharthbharat2 @PoojaMohanraj #DisneyPlusHotstar #DisneyPlusHotstarMalayalam #Crime #Thriller #Comedy pic.twitter.com/F5l03aT4rJ
— DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) January 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.