- Telugu News Photo Gallery Cinema photos Sukumar Birthday Special: Interesting Facts Of Pushpa 2 Director
Sukumar: మెగాస్టార్ చిరంజీవితో మొదటి సినిమా.. లెక్కల మాస్టారు గురించి ఈ విషయాలు తెలుసా?
పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టేసింది. శనివారం (జనవరి 11) సుకుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
Updated on: Jan 11, 2025 | 1:54 PM

పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టేసింది. శనివారం (జనవరి 11) సుకుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

అయితే సినిమాలపై ఆసక్తితో మొదట్లో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా చేరారు సుకుమార్. మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమా రైటింగ్ విభాగంలో తొలిసారిగా పనిచేశారు.

2004 సంత్సరంలో ఆర్య సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జగడం, 100 పర్సెంట్ లవ్, నాన్నకు ప్రేమతో, వన్ నేనొక్కడినే, రంగ స్థలం, పుష్ప, పుష్ప2 సినిమాలతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు.

ఇక నిర్మాతగానూ అభిరుచి చాటకున్నాడీ బ్లాక్ బస్టర డైరెక్టర్. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై కుమారి21F, ఉప్పెన, విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు.

పుష్ప 2 తర్వాత రామ్ చరణ్‌తో ఒక సినిమా ప్రకటించారు సుకుమార్. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు.