Pooja hegde: మాస్ హీరోల సినిమాల్లో నాయికగా పూజా
బ్యూటీ పూజా హెగ్దే గురించి ఎంత చెప్పినా తక్కువే, ఈ అమ్మడు తన అందం అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిన్నదానికి టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు ఏవీ లేవు. కానీ నార్త్‌లో మాత్రం ఈ బ్యూటీ తన సత్తా చాటుతోంది.
Updated on: Jan 11, 2025 | 1:30 PM

హీరోయిన్ అంటే ఎప్పుడూ పాటలు పాడుకుంటూ, సున్నితంగా స్టెప్పులేసుకుంటూ కనిపించాలా? రఫ్ అండ్ టప్‌గా ఎందుకు కనిపించకూడదు... పక్కన హీరో మాస్‌గా ఉంటే.. హీరోయిన్ సైలెంట్‌గా ఉండాలా? కాసింత వయొలెంట్‌గా ఉన్నా ఫర్వాలేదా? ఆ సంగతేమోగానీ, ప్రస్తుతం పూజా హెగ్డే సైన్ చేసిన సినిమాలన్నిటిలోనూ హీరో మాత్రం యమా వైలెంట్‌గా కనిపిస్తున్నారు.

పూజా హెగ్డే కనిపించడం లేదు... అని మొన్న మొన్నటి వరకూ అనుకున్నవారందరూ ఇక ఆ మాట అనరు. ఎందుకంటే ఎక్కడ ఫోర్స్ ఉంటుందో, ఎక్కడ హీరో ఎవరి మాటా వినకుండా రూత్‌లెస్‌గా కనిపిస్తారో.. అక్కడ నేనుంటా అని చెప్పకనే చెప్పేస్తున్నారు పూజా హెగ్డే.

దళపతి 69 షూటింగ్‌లో బిజీగా ఉంది ఈ అందాల ముద్దుగుమ్మ.పూజా నార్త్ మూవీ దేవా టీజర్ రిలీజ్ అయింది. షాహిద్ కేరక్టర్ చూసిన వాళ్లందరూ మాస్ సినిమాకు స్పెల్లింగ్ రాయిస్తున్నారని అంటున్నారు.

రూత్‌లెస్ పోలీస్‌గా షాహిద్ యాక్టింగ్ సూపర్ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తోంది నార్త్ ఇండస్ట్రీ. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది దేవా. మొన్న మొన్నటిదాకా సూర్య 44 అని వర్కింగ్ టైటిల్‌తో చలామణి అయింది రెట్రో సినిమా.

ఈ సినిమాలో సూర్య కేరక్టర్ కూడా పక్కా మాస్‌గా ఉంటుంది. యాక్షన్ ప్యాక్డ్ రివెంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు కార్తిక్ సుబ్బరాజ్. పెళ్లి కోసం తన డార్క్ పాస్ట్ వదులుకునే పాత్రలో కనిపించనున్నారు సూర్య.