Viral: పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో వైరల్.

Viral: పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Dec 27, 2024 | 4:50 PM

సాధారణంగా ఏదైనా టెంపుల్‌కు వెళ్లినప్పుడు మొక్కులు తీర్చుకుని.. హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు. కోరిన కోర్కెలు తీర్చాలని ఆయా దేవుళ్లకు మొక్కుకుంటారు. మరికొందరు కోర్కెలు నెరవేర్చాలని కట్టిన ముడుపులు చెల్లిస్తుంటారు. తిరుమల తిరుపతి లాంటి పెద్ద దేవాలయాలలో పేదా ధనిక అందరూ వేసే కానుకలు కోటి నుంచి ఐదు కోట్ల వరకూ ఉంటుంటాయి. అలా చిన్నా పెద్ద గుడులలో హుండీలలో అంతో ఇంతో కానుకలు వేయడం సాధారణం. అలా హుండీలలో వేసే కానుకలన్నీ దేవుడికే సొంతం. కానీ ఓ ఘటన మాత్రం చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడులోని తిరుపోరూర్‌లో ఈ ఘటన జరిగింది. దినేశ్‌ అనే భక్తుడు అక్కడి కందస్వామి ఆలయాన్ని దర్శించాడు. ఆ గుడిలోని హుండీలో డబ్బులు వేస్తుండగా అతడి చేతిలోని ఐఫోన్ జారి అందులో పడింది. కంగారు పడిన దినేశ్ ఈ విషయాన్ని ఆలయ అధికారులకు చెప్పాడు. తన ఐఫోన్‌ తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే హుండీలోకి చేరినవన్నీ దేవుడికి చెందుతాయని, దేవుడి ఆస్తిగా పరిగణిస్తామని ఆలయ అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో దినేశ్ టెన్షన్ పడ్డాడు. ఈ ఘటన నేపథ్యంలో శుక్రవారం నాడు ఆలయ అధికారులు ఆ హుండీని తెరిచారు. అందులో ఐఫోన్‌ ఉన్నట్లు గుర్తించారు. దినేశ్‌కు ఈ విషయం తెలిపారు. అయితే హుండీలో పడిన ఆ ఐఫోన్‌ దేవుడి ఆస్తి అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో దానిని తిరిగి ఇవ్వలేమని అన్నారు. కానీ ఐఫోన్‌లోని డేటాను తీసుకునేందుకు అనుమతిస్తామని తెలిపారు. అయితే తన ఐఫోన్‌ తనకు తిరిగి ఇవ్వాలని దినేశ్‌ పట్టుబట్టాడు.

మరోవైపు ఆ రాష్ట్ర మంత్రి పీకే శేఖర్‌బాబు దృష్టికి ఇది వెళ్లింది. ఆయన కూడా ఆలయ అధికారుల నిర్ణయాన్ని సమర్థించారు. ‘దేవుడి హుండీలో జమ అయినది ఏదైనా, పొరపాటుగా జరిగినప్పటికీ అది దేవుడి ఖాతాలోకి వెళ్తుంది. భక్తులకు తిరిగి ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవు’ అని అన్నారు. అయితే ఆ శాఖ అధికారులతో చర్చిస్తానని, ఆ భక్తుడికి నష్టపరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. దినేష్ ఫోన్‌ను తిరిగి ఇవ్వకపోవడంపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హుండీలో కానుకలు వేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని.. భక్తులు అప్రమత్తంగా ఉండాలని.. ఈ ఘటన అందరికీ గుర్తుచేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.