కోమాలో ఉన్న వ్యక్తి మనస్సులో ఏం జరుగుతుంది?

TV9 Telugu

27 December 2024

తీవ్రమైన అనారోగ్యం, ఏదైనా ప్రమాదం లేదా గాయం కారణంగా చాలాసార్లు కొందరు వ్యక్తులు కోమాలోకి వెళ్తుంటారు.

ఏదైనా అనారోగ్యం కారణంగా కోమాలో ఉండే సదరు వ్యక్తి తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా చాలామంది భావిస్తారు.

కోమాలో ఉన్న వ్యక్తి శరీరంలో మెదడు కార్యకలాపాలు చాలా తక్కువగా ఉంటాయని అంటున్నారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు.

అనుకోని సంఘటన కారణంగా కోమాలో ఉన్న తర్వాత కూడా బయటి విషయాలు వినవచ్చని అనుకొంటారు చాలామంది వ్యక్తులు.

ఇది కాకుండా, కొన్నిసార్లు కోమాలో ఉన్న వ్యక్తి తన కనురెప్పల ద్వారా స్పందించవచ్చని చాలమంది ప్రజలు భావిస్తారు.

కానీ కోమాలో ఉన్న వ్యక్తి బాహ్య సంఘటనలకు ప్రతిస్పందించలేడు. అతనికి నొప్పి కూడా అనిపించదని అంటున్నారు నిపుణులు.

అనారోగ్యంతో కోమాలో పడి ఉన్న వ్యక్తి స్పర్శను కోల్పోయినప్పటికీ శరీరం కొన్నిసార్లు దానంతట అదే కదలవచ్చు.

ఇది అసాధారణ ప్రకంపనలకు కారణం కావచ్చు. అది కేవలం బ్రెయిన్ మాత్రమే పని చేస్తూ ఉండటమే అంటున్నారు వైద్య నిపుణులు.