పాలకూర వీటితో కలిపి తిన్నారో.. మీ ఒంట్లో ఈ పార్ట్‌ మటాష్‌!

27 December 2024

TV9 Telugu

TV9 Telugu

ఆకుకూరల్లో తోటకూర తర్వాత ఎక్కువగా వినిపించేది పాలకూరే. దీని రుచి కారణంగా చాలా మంది పాలకూర తినడానికి ఇష్టపడరు. కానీ దీనివల్ల బోలెడన్ని లాభాలున్నాయి

TV9 Telugu

ఇందులో దాదాపు 13 రకాల యాంటీయాక్సిడెంట్లున్నాయి. ఇవి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. పాలకూరలో విటమిన్‌ కెతోపాటు ఎ, సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి

TV9 Telugu

రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉబ్బసం, ఆస్టియోపోరోసిస్‌, ఆర్థరైటిస్‌, టైప్‌ 2 డయాబెటిస్‌, మైగ్రేన్‌లను నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

అందుకే పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే చలికాలంలో పాలకూరను కొన్ని రకాల ఆహారాలతో కలిపి తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

TV9 Telugu

పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పాలు లేదా చీజ్‌లోని కాల్షియంతో చర్య జరిపితే శరీరంలో కాల్షియం శోషణను దారితీస్తుంది. అందుకే వీటితో కలిపి అస్సలు తినకూడదు

TV9 Telugu

పాలకూరను పెరుగుతో కూడా కలిపి తినకూడదు. ఒకవేళ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. పాలకూరలో ఐరన్‌ ఉంటుంది. ఇది ఒకదానికొకటి చర్య జరిపి జీర్ణ శోషణను తగ్గిస్తుంది

TV9 Telugu

అలాగే పాలకూరలో ఉండే ఆక్సలేట్ నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లతో కలిస్తే కాల్షియం ఆక్సలేట్‌గా తయారవుతుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే ప్రమాదం ఉంది

TV9 Telugu

పాలకూరను చేపలతో కలిపి అసలెప్పుడూ తినకూడదు. వీటి కలయిక శరీరంలోని జీర్ణక్రియ, పోషణ సమతుల్యతను దెబ్బతీస్తుంది. అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు