Telangana: విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు.. నకిలీలకు ఇక చెక్..
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే రెగ్యూలర్ టీచర్లకు బదులు కొంతమంది వేరేవారిని పెట్టి పాఠాలు చెప్పిస్తున్న వైనానికి చెక్ పెట్టేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పోస్టింగ్‌లలో ఉన్న టీచర్ల ఫోటోలను వారి వివరాలతో సహా స్కూల్ ఆవరణ/నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని కొద్దిరోజుల క్రితం పాఠశాల విద్యా శాఖ సర్కూలర్ జారీ చేసింది .
కొంతమంది టీచర్ల నిర్వాకంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో కేటాయించిన టీచర్లు వారి ప్లేస్‌లో వాలంటీర్లను నియమించి ఎక్కువ కాలం స్కూల్ మోహం చూడటం లేదు. ఇది ప్రభుత్వ దృష్టికి రావడంతో ఉన్నతాధికారులు ఈ మేరకు అసలు టీచర్లు ఎవరనేది విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు గ్రామస్థులకు తెలిసేలా పాఠశాలల్లో టీచర్ల ఫోటోలు, వివరాలను ప్రదర్శించాలని ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో దాదాపు లక్షకు పైగా ఉపాధ్యాయులు సర్కారు బడుల్లో పని చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ లో టీచర్లు దూరం కావడం లేదా ఇతర పనులు చూసుకునేందుకు స్థానికంగా ఉండే వారిని వారి ప్లేస్‌లో నియమించి అసలు టీచర్లు డుమ్మా కొడుతున్నారు. అంటే సాప్ట్ వేర్ లో ప్రాక్సీ లాగా నకిలీ టీచర్లు పని చేస్తున్నారు. వీరికి అసలు టీచర్లు దాదాపు పది వేల రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. లాంగ్ లీవ్ పెట్టలేక ఇలా నకిలీలతో మ్యానేజ్ చేస్తూ మొత్తం జీతం కొట్టేస్తున్నారు కొంతమంది టీచర్లు.. ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్లను గుర్తించక అసలు ఉపాధ్యాయులు ఎవరో స్టూడెంట్స్‌కు తెలియకుండా పోతుంది. రాష్ట్రంలోని రిమోట్ ఏరియాలు అంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో తాజా సర్క్యూలర్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని స్కూల్ ఎడ్యూకేషన్ విభాగం భావిస్తోంది.
ఇటీవల టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు జరగడం, కొత్తగా నియామకాలు చేపట్టడంతో జిల్లా అధికారులకు ఆయా గ్రామాల్లో ఎవరు పని చేస్తున్నారో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. పర్యవేక్షణకు వెళ్లిన అసలు ఎవరు, నకిలీ ఎవరు అనేది పట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఫోటో, వివరాలు ప్రదర్శనతో అందరికీ ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠాశాలలు, గురుకులాలు. కేజీబీవీలలో ఈ ఫోటోల ప్రదర్శన జరుగుతోంది. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఇతర టీచర్ల ఫోటోలు సేకరించి నోటీస్ బోర్డులో ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది టీచర్ల పాస్ పోటోలు సైతం అంటిస్తున్నారు. మొత్తంగా తమ వ్యక్తిగత పనులు లేదా ఇతర పనుల్లో బిజీ ఉండే టీచర్లకు బాధ్యతను గుర్తు చేసే అవసరం రావడం శోచనీయం. వారి ప్లేస్‌లో వచ్చే నకిలీ టీచర్లకు ఇలా అయినా చెక్ పడుతుందేమో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి